క్వారంటైన్ లో విరాట్ కోహ్లీ..ఏంచేస్తున్నాడంటే?

Update: 2020-11-17 14:30 GMT
ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ , ప్రపంచ  క్రికెట్ లో మేటి బ్యాట్ మెన్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. ఈ మద్యే ఐపీఎల్ ముగియండం తో అతి త్వరలో ఇండియా టీం ఆసీస్ పర్యటనను వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్ టూర్ కి ఎంపికైన ప్రతి ఆటగాడు ప్రస్తుతం నిబంధనల ప్రకారం క్వారంటైన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కో ఆటగాడు ఒక్కో విధంగా కాలక్షేపం చేస్తున్నారు. తాజాగా కెప్టెన్ కోహ్లీ సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసాడు.

ఆ పోస్ట్ కు ''క్వారంటైన్ డైరీస్, ఇస్త్రీ చేయని టీ-షర్టు, సౌకర్యవంతమైన మంచం అలాగే , చూడటానికి మంచి సిరీస్ అంటూ  కోహ్లీ క్యాప్షన్ చేశారు. అయితే ఈ భారత ఆస్ట్రేలియా పర్యటన నవంబర్ 27న సిడ్నీలో వన్డే మ్యాచ్ తో ప్రారంభమవుతుంది. ఇక అడిలైడ్ వేదికగా డిసెంబర్ 17న జరిగే మొదటి టెస్ట్ తర్వాత కోహ్లీ భారత్ పితృత్వ సెలవుల కోసం ఇండియా కు తిరిగి వచ్చేస్తాడు.ప్రస్తుతం విరాట్ భార్య అనుష్క శర్మ గర్భవతి అన్న సంగతి తెలిసిందే.  కంగారూ గడ్డపై భారత్‌ మొదటగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత డిసెంబర్‌ 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆసీస్‌, ఇండియా తలపడనున్నాయి.
Tags:    

Similar News