మోనాలిసా తల్లి కాబోతోందా?
మోనాలిసా.. గత ఏడాది కాలంగా ఈ పేరు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే.;
మోనాలిసా.. గత ఏడాది కాలంగా ఈ పేరు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ మీడియా కళ్లలో పడిన ఈ నేచురల్ బ్యూటీ.. ఆ తర్వాత సినిమల్లోనూ అవకాశాలు దక్కించుకోవడం.. అనేక ఈవెంట్లలోనూ కనిపించడం తెలిసిందే. మధ్యలో కొన్నాళ్లు ఆమె మీడియాలో కనిపించలేదు కానీ.. గత రెండు నెలలుగా ఆమె పేరు మళ్లీ మార్మోగుతోంది. ఫర్మాన్ ఖాన్ అనే అబ్బాయితో కలిసి ఆమె కేరళలో ప్రత్యక్షం కావడం, తల్లిదండ్రుల నుంచి రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించడం.. అంతలోనే ఆ కుర్రాడిని పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో చాలామంది ఇది లవ్ జిహాద్ అని ఆరోపించగా.. అదేమీ కాదని ఆమె ఖండించిన సంగతి తెలిసిందే. మరోవైపు మోనాలిసా మేజర్ కాదని, ఆమె వివాహం చెల్లదని.. తల్లిదండ్రులు ఫర్మాన్ మీద పోక్సో కేసు నమోదు చేయడం సంచలనం రేపింది.
ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పుడు మోనాలిసా తల్లి కాబోతున్నట్లు వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరు కావాలని మోనాలిసాను పోలీసులు కోరగా.. ఆమె గర్భవతి అన్న విషయాన్ని వెల్లడిస్తూ, తనిప్పుడు ప్రయాణం చేయలేదని ఫర్మాన్ ఖాన్ తెలిపాడు. ఓవైపు మోనాలిసా మేజర్ కాదని కేసు నడుస్తుంటే.. ఈలోపు ఆమె ప్రెగ్నెంట్ కావడమేంటి అనే చర్చ మొదలైంది. ఒకవేళ పెళ్లి సమయానికి మోనాలిసా మేజర్ కాదని తేలితే.. మైనర్‌ను గర్భవతిని చేసినందుకు ఫర్మాన్ మీద పోక్సో కేసు మరింత బలపడుతుంది. అతను తీవ్ర నేరానికి పాల్పడినట్లు అవుతుంది. ఇంతకీ మోనాలిసా నిజంగా గర్భవతేనా అని ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఫర్మాన్, మోనాలిసా కేరళలోనే ఉంటున్నారు. వారికి పోలీసులు రక్షణ కూడా కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.