ఇరాన్ సుప్రీం నేతకి కొత్త ముఖం...!

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ సంయుక్తంగా చేసిన దాడులు యుద్దంకు దారి తీశాయి. ఇరాన్‌ సైతం చాలా తీవ్రంగా ప్రతిఘటించడంతో యుద్దం సీరియస్‌గా మారింది.;

Update: 2026-04-24 07:08 GMT

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ సంయుక్తంగా చేసిన దాడులు యుద్దంకు దారి తీశాయి. ఇరాన్‌ సైతం చాలా తీవ్రంగా ప్రతిఘటించడంతో యుద్దం సీరియస్‌గా మారింది. మూడు దేశాలకు సంబంధించిన యుద్ధం కాస్త రోజులు గడుస్తున్న కొద్ది అది ప్రపంచ దేశాలపైనా పడింది. ఆసియా దేశాల ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయ్యే విధంగా యుద్ధం మారింది. ఈ మొత్తం యుద్దానికి కారణం ఏంటి అంటే ఏ ఒక్కరు సరైన సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడం మొదలు పెట్టిన రోజే సుప్రీం లీడర్‌ చనిపోయిన విషయం తెల్సిందే. సుప్రీం లీడర్‌ చనిపోవడంతో వెంటనే ఇరాన్‌ దిగి వస్తుందని, అమెరికా, ఇజ్రాయిల్‌ చెప్పినట్లు వింటుందని అంతా భావించారు. కానీ చాలా స్పీడ్‌గా కొత్త సుప్రీం లీడర్‌ను ఇరాన్‌ ప్రజల ముందుకు తీసుకు వచ్చారు. మొజ్తాబా ఖమేనీని ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా ప్రకటించారు.

సుప్రీం లీడర్‌ హత్యకు అమెరికా...

ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా ప్రకటించి వారాలు గడచినా ఆయన మాత్రం మీడియా ముందుకు రాలేదు, కనీసం ఒక చిన్న వీడియోను సైతం విడుదల చేయలేదు. కానీ ఆయన ఆదేశాల అనుసారం యుద్దం సాగుతుందని, ఇరాన్‌ లో పరిపాలన ఆయన ఆదేశాల అనుసారంగా నడుస్తోందని స్థానిక మీడియా కథనాలు రాస్తూ వచ్చింది. ఆయన మీడియా ముందుకు రాకపోవడం, ఎలాంటి పరిస్థితులు ఎదురు అయినా ఆయన మాత్రం కనిపించకపోవడంతో అసలు ముజ్తాబా ఖమేనీ ఉన్నాడా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అమెరికా సైనికులు ముజ్తాబా సైతం చనిపోయాడు అంటూ ప్రచారం చేశారు. అలా ప్రచారం వచ్చిన ప్రతిసారి ఇరాన్‌ మీడియా ఆ వార్తలను ఖండిస్తూ వచ్చింది. తాజాగా మొజ్తాబా ఖమేనీ గురించి షాకింగ్‌ విషయాలు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి.

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ...

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యం బాగాలేదనే వార్తలు వస్తున్నాయి. యుద్ధం మొదలైన రోజు మొజ్తాబా ఖమేనీ మొహం కాలింది, కాలు విరిగి, చేయికి గాయాలు అయ్యాయి. అందుకే ఆయన మీడియా ముందుకు రావడం లేదు. ఆయన ప్రస్తుతం అత్యంత రహస్య ప్రదేశంలో చికిత్స పొందుతున్నారు. ఇరాన్‌ కి చెందిన అత్యున్నత అధికారులకు సైతం ఖమేనీ ఎక్కడ చికిత్స పొందుతున్నాడు అనే విషయం తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఖమేనీ తనను సుప్రీం లీడర్‌గా ఎంపిక చేసిన తర్వాత పరిపాలన కోసం ఒక బోర్డ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందట. ఖమేనీ ఆదేశాల అనుసారం ఆ బోర్డ్‌ ఇప్పుడు ఇరాన్‌ ను పరిపాలిస్తూ, దేశంలోని పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేస్తోంది. యుద్దం విషయంలోనూ ఈ బోర్డ్‌ కీలక నిర్ణయాలు తీసుకోకుండా కేవలం ఖమేనీ ఆదేశాలను పాటిస్తూ వస్తుంది.

మొజ్తాబా ఖమేనీకి ప్లాస్టిక్ సర్జరీ..

ప్రస్తుతం ఖమేనీకి వరుస ఆపరేషన్‌లు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు ఆపరేషన్‌లు జరిగినట్లుగా సమాచారం అందుతోంది. ప్రమాదంలో ఖమేనీ పెదాలు పూర్తిగా కాలి పోయాయట. దాంతో పాటు ఆయన ఒక కాలు సైతం పూర్తిగా తొలగించాల్సిన పరిస్థితి వచ్చిందట. ఇక ముఖం సైతం పూర్తిగా కాలిపోవడంతో ప్లాస్టిక్‌ సర్జరీ చేస్తున్నట్లు చెబుతున్నారు. పలు మార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయడంతో ఖమేనీ పూర్తిగా కొత్త ముఖం తో కనిపించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇప్పుడు మీడియాలో కనిపిస్తున్న ఫోటోలతో పోల్చితే ఖమేనీ చాలా కొత్తగా కనిపించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అమెరిక్‌ సైన్యం మొజ్తాబా ఖమేనీని అంతం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన మాత్రం అత్యంత రహస్య ప్రాంతంలో చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News