చిరు సార్ మీది లార్జ్ హార్ట్: దేవరకొండ

Update: 2018-08-20 04:56 GMT
తెలుగులో వచ్చే కొత్త నటులకెవరికైన మెగాస్టార్ చిరంజీవి ఒక ఇన్స్పిరేషన్. అందులో ఏమీ అనుమానం లేదు. ఇక బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళకి ఆయనో రోల్ మాడల్.  మరి విజయ్ దేవరకొండ అందుకు ఎక్సెప్షన్ కాదు.  'గీత గోవిందం' సక్సెస్ మీట్ కి మెగాస్టార్ ముఖ్య అతిధి గా హాజరైన విషయం తెలిసిందే.  విజయ్ తన స్పీచ్ లో సమయంలో మెగాస్టార్ గురిచి మాట్లాడుతూ ఎగ్జైట్ అయ్యాడు.  చిరు సర్ తో ఉంటే తన మైండ్ బ్లాంక్ అవుతుందని చెప్పడం విశేషం.

విజయ్ మాటల్లోనే మెగాస్టార్ గురించి ఏం  చెప్పాడో చూద్దాం.  "చిరు సర్ ను ఈ ఫంక్షన్ కు పిలిచేందుకు సార్ ఇంటికి వెళ్ళినప్పుడు జస్ట్ 'వస్తానమ్మా' అని ఒక్క ముక్కలో చెప్పి ఫినిష్ చెయ్యొచ్చు గానీ అలా చేయలేదు.  ఆల్మోస్ట్ ఒక గంట సేపు మాతో కూర్చొని 'గీత గోవిందం' సినిమాలో అయనకు నచ్చిన ప్రతి డైలాగ్ చెప్తూ.. ఆయనకు నచ్చిన యాక్షన్స్..  రియాక్షన్స్. మిగతా క్యారెక్టర్స్ ఇచ్చిన రెస్పాన్స్ అలా ప్రతి ఒక్క మూమెంట్ అలా కవర్ చేస్తూ వచ్చారు.   మేము చేసిన సినిమా గురించి.. మా యాక్టింగ్ గురించి చిరు సార్ రియాక్ట్ కావడం చూస్తే  నా మైండ్ లో 'అసలిక్కడ ఎం నడుస్తుంది బాసు ఇక్కడ?.. అసలేమైతుంది?' అని అనిపించింది.  అసలెన్ని సార్లు మీతో ఉన్నా నాకు అసలేమైతుందో అర్థం కాదు సార్ నాకు!"

"ఇంకొకటి.. ఈరోజు 'సై రా' షూట్ ఉన్నప్పటికీ దాన్ని క్యాన్సిల్ చేసి చిరు సర్ ఈ ఫంక్షన్ కోసం ఇక్కడికి రావడం జరిగింది... మాకోసం ఎందుకింత చేస్తున్నారో నాకు తెలీదు. సార్ మీదో లార్జ్ హార్ట్.  థ్యాంక్ యు సో మచ్ సర్.  'సైరా' మీ డ్రీమ్ ఫిలిం అని నాకు తెలుసు.  మీరు ఆ సినిమాను ఎంత ప్రేమిస్తున్నారో ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో నాకు తెలుసు సార్.  కానీ మాకోసం షూట్ క్యాన్సిల్ చేసుకొని ఒక చిన్న సెలబ్రేషన్ ఫంక్షన్ కి వచ్చారు.  థ్యాంక్ యు సో మచ్ సార్."
Tags:    

Similar News