విజ‌య్ బ‌ర్త్ డే.. ఫ్యాన్ మేడ్ పోస్టర్లతో రాజకీయ కలకలం!

Update: 2021-06-22 17:30 GMT
ఇవాళ‌ త‌మిళ్ స్టార్ హీరో విజ‌య్ బ‌ర్త్ డే. త‌మ అభిమాన హీరోకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ‌డం స‌హ‌జం. అయితే.. త‌మిళ‌నాట విజ‌య్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ రాజ‌కీయ వివాదానికి దారితీసేలా ఉంది.

త‌మిళ‌నాట విజ‌య్ కు భారీ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీకాంత్ తర్వాత ఆ స్థాయిలో అభిమానులు ఉన్న న‌టుడు విజ‌య్‌. ఆయ‌న‌కు అఫీషియ‌ల్ గా ‘విజ‌య్ మ‌క్క‌ల్ ఇయ్యక్కం’ అనే అభిమాన సంఘం కూడా ఉంది. ఈ సంఘం స‌భ్యులు విజ‌య్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఓ పోస్ట‌ర్ వేయించారు.

త‌మిళ‌నాడులోని దిండుక్క‌ల్ ప్రాంతానికి చెందిన విజ‌య్ అభిమాన సంఘం సభ్యులు త‌యారు చేయించిన ఈ ఫ్లెక్సీలో.. విజ‌య్ తోపాటు త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ ఫొటోను కూడా ఉంచ‌డం వివాదాస్ప‌ద‌మైంది. అంతేకాదు.. స్టాలిన్ త‌న చేతిలోని రాజ‌దండాన్ని విజ‌య్ కు అందిస్తున్న‌ట్టుగా ఏర్పాటు చేశారు.

దానికి ఓ కొటేష‌న్ కూడా ఏర్పాటు చేశారు. ‘పేద ప్రజల కోసం మంచి పాలన అందించడానికి తమ్ము రా! సార‌థ్యం వ‌హించ‌డానికి రా! అని స్టాలిన్ పిలుస్తున్న‌ట్టుగా పోస్ట‌ర్ పై వ్యాఖ్య‌లు ఉండ‌డం వివాదానికి దారితీసింది. స్టాలిన్‌ ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. దీనిపై డీఎంకే కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News