• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చెత్త లారీలో వెంటిలెటర్లు...

చెత్త లారీలో వెంటిలెటర్లు ... అసలు సంగతేమిటంటే ?

By - Tupaki Desk
Update: 2021-04-07 07:45 GMT
దేశంలో కరోనా మహమ్మారి జోరు మళ్లీ మునుపటి రోజులని గుర్తు చేస్తున్నాయి. వరుసగా మూడు రోజుల్లో రెండు సార్లు లక్ష కి పైగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీనితో పలు రాష్ట్రాల్లో కరోనా నియమాలని పక్కాగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో ఎక్కువగా కేసులు వెలుగులోకి వస్తున్న మహారాష్ట్రలో వీకెండ్ లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకువచ్చారు. మరికొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. . అయితే..అక్కడకక్కడ కొంత నిర్లక్ష్య ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్ బారిన పడిన రోగులకు ఉపయోగించే వెంటిలెటర్లను చెత్తను తరలించే వాహనాల్లో తరలించడం తాజాగా వివాదాస్పదమైంది. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యకం చేస్తున్నారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.

గుజరాత్ రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్  కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న క్రమంలో వెంటిలేటర్ల సమస్య ఏర్పడుతోంది. వెంటిలెటర్లను తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. వల్పాడ్ పట్టణం నుంచి సూరత్ లోని సివిల్ ఆసుపత్రికి 34 వెంటిలేటర్లను తరలించాలని నిర్ణయించారు. సూరత్ మున్సిపాల్టీ నుంచి ఓ చెత్త లారీని తీసుకొచ్చారు. అందులో 34 వెంటిలేటర్లను ఉంచి ఆసుపత్రికి పంపించారు. ఇది చూసిన జనం నోరెళ్లబెట్టారు. ఎంతో జాగ్రత్తగా తరలించాల్సిన వెంటిలేటర్లను చెత్త లారీలో తరలిస్తారా , ఇదేనా మీ జాగ్రత్త  అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. రోడ్డుపై వెళుతున్న వారు..ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక గుజరాత్ రాష్ట్రంలో కరోనా కేసుల విషయానికి వస్తే…గత 24 గంటల్లో 3 వేల 280 కొత్త కేసులు వెలుగు చూశాయి. రెండు వేల 167 మంది డిశ్చార్జ్ అయ్యారు. 17 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం లక్షా 73 వేల 348 యాక్టివ్ కేసులుండగా 171 మంది వెంటిలెటర్ పై చికిత్స పొందుతున్నారు. 70 లక్షల 38 వేల 445 మంది మొదటి కరోనా టీకా తీసుకున్నట్లు, 8 లక్షల 47 వేల 185 మంది రెండో కరోనా టీకా వేయించుకున్నారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
Tags:    
  • Ventilators 
  • garbage truck 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Telugu News Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

చైనాకు చెక్: AI సప్ల‌య్ చైన్ ర‌క్ష‌ణ‌కు భార‌త్ స‌హా 9 దేశాల ఒప్పందం!

2026-11-16 19:30 GMT

కోస్తా మీద పడగ విప్పనున్న అక్వాన్

2026-11-16 19:30 GMT

అప్పుడేమో ‘వందే భారత్’.. ఇప్పుడేమో ‘బ్రేక్‌లు భారత్’

2026-11-16 19:30 GMT

రాముడు కాదు కృష్ణుడు...యూపీ కోసం బీజేపీ కొత్త అస్త్రం !

2026-11-16 19:13 GMT

మేయర్లు జెడ్పీ చైర్మన్ల వేతనం ఎంతో తెలుసా ?

2026-11-16 19:13 GMT

వృద్ధ భారతం... దక్షిణాదికే భారం

2026-11-16 19:13 GMT

'సెల్ఫీ' లీడర్లపై జగన్ సీరియస్.. 60-70 మంది ఇంచార్జుల మార్పు!?

2026-11-16 19:13 GMT

ఇంచార్జిలకు జగన్ మార్క్ బిగ్ షాక్ ?

2026-11-16 19:12 GMT

ట్రెండీ టాక్: బాబు స‌మ‌క్షంలో మెగా బ్ర‌ద‌ర్స్‌ మాస్టర్ క్లాసులు!

2026-11-16 19:11 GMT

నదిని వదలను...ఆసుపత్రి నుంచే బిట్టూ పట్టు !

2026-11-16 19:11 GMT

తీరం దిశగా దూసుకొస్తున్న అక్వాన్ : ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. ప్రజలు తప్పక తెలుసుకోవాల్సిన హెచ్చరికలు

2026-11-16 19:08 GMT

అటు వారు ఇటు.. ఇటు వారు అటు.. సిక్కోలు రాజకీయ చిత్రం

2026-11-16 19:07 GMT

Copyright @2026

Powered by Blink CMS