• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  ఇంచార్జిలకు జగన్ మార్క్...

ఇంచార్జిలకు జగన్ మార్క్ బిగ్ షాక్ ?

| 2029 ఎన్నికలే లక్ష్యంగా వైసీపీని బలోపేతం చేసేందుకు జగన్ కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సుమారు 70–80 నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిల పనితీరు బాగోలేదని పార్టీకి నివేదికలు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో జగన్ సమావేశం కానున్నారు. పనితీరు మెరుగుపరచుకోని వారికి ఉద్వాసన పలికి కొత్త నేతలకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

By - Satya P
Update: 2026-11-16 19:12 GMT

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీలో సమూలమైన ప్రక్షాళనకు సీరియస్ గానే యాక్షన్ ప్లాన్ ని రెడీ చేస్తున్నారు. పని చేసే వారికి పట్టం కట్టడంతో పాటు చేయని వారిని వదిలించుకోవాలని చూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు రెండున్నరేళ్ల వ్యవధిలో ఉండగానే పార్టీని యాక్టివ్ చేయాలని జగన్ చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఒక అగ్ని పరీక్షగా జగన్ ముందే ఇంచార్జిలకు చెప్పి ఉంచారు. పార్టీ గెలుపు కోసం నిబద్ధతతో అంకిత భావంతో పనిచేయాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు. గత నాలుగైదు నెలలుగా జగన్ వరుస సమావేశాలు పెట్టి మరీ ఇంచార్జిలను రీ చార్జి చేసే ప్రయత్నం చేశారు. అయితే జగన్ చేసిన ఈ ప్రయత్నాలు సగం మాత్రమే ఫలితాలు ఇచ్చాయని అంటున్నారు. సగానికి సగం మంది ఇంచార్జిలు అయితే అధినేత హెచ్చరించినా కూడా దారికి రాలేదని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో జగన్ మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటు చేశారు.

సంచలన నిర్ణయమే :

ఈ కీలక సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులతో జగన్ నియోజకవర్గాల ఇంచార్జిల గురించే ప్రధానంగా చర్చిస్తారు అని అంటున్నారు. పని తీరు సరిగ్గా లేని నాయకులను మార్చాలని జగన్ పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. ఆ విషయాన్ని ఆయన ముఖ్య నాయకులతో కూడా చర్చిస్తారు అని తెలుస్తోంది. మొత్తం ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో దాదాపు 70 నుండి 80 నియోజకవర్గాల వరకూ చూస్తే వైసీపీ ఇంచార్జిల పని తీరు ఏ మాత్రం బాగు లేదని వైసీపీ హైకమాండ్ కి సమగ్ర నివేదికలు వచ్చాయి. దాంతో పెద్ద సంఖ్యలోనే అనేక నియోజకవర్గాలలో నాయకత్వ మార్పులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

పట్టించుకోని తీరు :

వైసీపీలో సంస్థాగతంగా భారీ మార్పులు చేయాల్సిందే అని వైసీపీ అధిష్టానం గట్టి పట్టుదలగా ఉంది. పార్టీ పట్ల అభిమానం, అంకితభావం, క్యాడర్ పట్ల ఆదరణ ఇంచార్జిలకు ఉండాలని అధినాయకత్వం చెబుతూ వచ్చింది. కానీ తాజా స్థానిక ఎన్నికల్లో మాత్రం ఎక్కువ నియోజకవర్గాలలో ఇంచార్జిలు మొక్కుబడిగా పనిచేశారు అని నివేదికలు చెబుతున్నాయి. కార్యకర్తలను ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరించారు అని అంటున్నారు. నామినేషన్లు దాఖలు చేసిన దిగువ స్థాయి నేతలు అయితే ఎన్నో ఇబ్బందులు పడ్డారని అంటున్నారు. చాలా చోట్ల ప్రచారానికి కూడా ఇంచార్జిలు పోలేదని అంటున్నారు. ఎటూ ఎన్నికల్లో గెలిచేది లేదని ముందే ఫిక్స్ అయి ప్రత్యర్థి పార్టీలతో మ్యాచ్ ఫిక్స్ కూడా చేసుకుని పూర్తిగా కాలక్షేపం చేశారు అని అంటున్నారు. దాంతో వైసీపీ అధినాయకత్వం ఈ తరహా పేలవమైన పనితీరుని సహించేది లేదని అంటోంది.

2029 ఎన్నికలే లక్ష్యంగా :

అనూహ్యమైన మార్పులు అత్యధిక నియోజకవర్గాలలో ఉంటాయని అంటున్నారు. ఎంత పెద్ద నాయకులు అయినా కొన్ని చోట్ల మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అయినా కూడా పని తీరు బాగా లేకపోతే తీసి పక్కన పెడతారు అని అంటున్నారు. ఆయా చోట గట్టి నేతలను ఇప్పటి నుంచే ఎంపిక చేసి పెట్టుకుంటే 2029 ఎన్నికల నాటికి వారే గెలుపు గుర్రాలు అవుతారని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు. ఏపీలో కూటమి పాలన పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉందని అయినా వైసీపీ ఇంచార్జిలు చాలా చోట్ల దానిని ఉపయోగించుకోలేదని భావిస్తున్నారు. బాగా పోరాడిన చోట మంచి ఫలితాలు వచ్చాయని కూడా పార్టీ గుర్తు చేస్తోంది. కార్యకర్తలకు అండగా లేకపోతే రేపటి రోజున ఇంచార్జిలకు టికెట్లు ఇస్తే వారు ఎలా పనిచేస్తారు అని కూడా హైకమాండ్ ప్రశ్నగా ఉంది. అందుకే పనిచేయని వారిని నిర్దాక్షిణ్యంగా తీసి పక్కన పెట్టడమే మంచి నిర్ణయంగా భావిస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వైసీపీలో భారీ మార్పులు సంచలన నిర్ణయాలు ఉండబోతున్నాయని అంటున్నారు.

Tags:    
  • ysjagan 
  • ysrcp 
  • andhrapradeshpolitics 

Similar News

మేయర్లు జెడ్పీ చైర్మన్ల వేతనం ఎంతో తెలుసా ?

2026-11-16 19:13 GMT

తీరం దిశగా దూసుకొస్తున్న అక్వాన్ : ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. ప్రజలు తప్పక తెలుసుకోవాల్సిన హెచ్చరికలు

2026-11-16 19:08 GMT

అటు వారు ఇటు.. ఇటు వారు అటు.. సిక్కోలు రాజకీయ చిత్రం

2026-11-16 19:07 GMT

రెండో విడత మున్సిపోల్స్ : అందరి దృష్టి గుడివాడపైనే.. మాటల నాని చేతల్లో చూపగలరా..?

2026-11-16 19:03 GMT

భీమవరం కూటమిలో బీజేపీ రగడ.. తగ్గేదేలే అంటున్న కేంద్ర మంత్రి

2026-11-16 19:00 GMT

విశాఖలో ఎలక్ట్రిక్ బస్సులు...వారికి ఫ్రీగానే !

2026-11-16 18:55 GMT

భారీ చిట్టాతో ఢిల్లీకి చంద్రబాబు.. కేంద్ర మంత్రివర్గంపై చర్చ, వేమిరెడ్డికి చాన్స్?

2026-11-16 10:24 GMT

విజయసాయిరెడ్డి ఎక్కడ? పార్టీ ప్రకటన తర్వాత కనిపించని పీఆర్పీ అధినేత

2026-11-16 06:51 GMT

వైఫ్ ఆఫ్ కూన రవి...చైర్ పర్సన్ అభ్యర్థిగా !

2026-11-16 04:28 GMT

చంద్రబాబును కలిసిన షర్మిల.. అసలు విషయం ఇదే!

2026-11-16 04:22 GMT

జనసేన అభ్యర్థులు వీరే...పోటీ ఆసక్తికరం

2026-11-15 20:51 GMT

Copyright @2026

Powered by Blink CMS