బాబును అడ్డంగా బుక్ చేసేసిన వెంకయ్య నాయుడు!
మొన్నటి వరకూ చంద్రబాబుకు సోదర సమానుడు అన్నట్టుగా వ్యవహరించిన వెంకయ్య నాయుడు ఇప్పుడు తెలుగుదేశం అధినేతను అడ్డంగా బుక్ చేశారు. అది కూడా పాలనాపరమైన వ్యవహారంలో చంద్రబాబు తీరును పరోక్షంగా దెప్పి పొడిచారు వెంకయ్య నాయుడు. ఉప రాష్ట్ర పతి హోదాలో ఆయన తెలుగు రాష్ట్రాల మధ్యన విబేధాల అంశం గురించి మాట్లాడారు. వివాదాల పరిష్కారానికి ప్రస్తుత ముఖ్యమంత్రులు చూపుతున్న చొరవను వెంకయ్య ప్రశంసించారు.
'ఇంతకు ముందే ఈ చర్యలు చేపట్టాల్సింది. కనీసం ఇప్పుడైనా చేపడుతుండటం మంచిది..' అన్నట్టుగా వెంకయ్య వ్యాఖ్యానించారు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే.. చంద్రబాబు నాయుడ మాజీ ముఖ్యమంత్రి కావడం మినహా మార్పు ఏమీ లేదు. కేసీఆర్ అప్పుడూ ముఖ్యమంత్రే, ఇప్పుడూ ముఖ్యమంత్రే. జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు.
వీరిద్దరూ సఖ్యతగా కనిపిస్తూ ఉన్నారు. కేవలం వ్యక్తిగత స్నేహం మాత్రమే కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల గురించి కూడా వీరి మధ్యన చర్చలు జరుగుతూ ఉన్నాయి. విభజన జరిగి ఐదు సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ పరిష్కారం కాని అంశాల గురించి వీరు పరిష్కరిస్తూ ఉన్నారు. గత ఐదేళ్లుగా వివాదాలుగా మిగిలిపోయిన అంశాలను కేసీఆర్ , జగన్ లు పరిష్కరించుకుంటున్నారు. ఈ అంశాన్ని వెంకయ్య నాయుడు కూడా స్వాగతించారు.
చంద్రబాబుకు ఆయన ఎంత సన్నిహితులో చెప్పనక్కర్లేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా పేర్గాంచిన ముఖ్యమంత్రులను అభినందిస్తూ ఉన్నారు. అంతటితో ఆగకుండా.. ఇంతకు ముందే చొరవ చూపి పరిష్కరించాల్సిందని, కారణాలు ఏవైనా అప్పుడు పరిష్కారం కాలేదని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. తద్వారా విభజన వివాదాలు పరిష్కారం కాకపోవడానికి చంద్రబాబు నాయుడే కారణం అనే అభిప్రాయాన్ని వెంకయ్యనాయుడు కూడా పరోక్షంగా వ్యక్తం చేసినట్టుగా విశ్లేషకులు అంటున్నారు.
చంద్రబాబు నాయుడు కేసీఆర్ తో కావాలని పేచీలు పెట్టుకున్నారని - ఓటుకు నోటు వ్యవహారం- తెలంగాణలో తెలుగుదేశంతో టీఆర్ ఎస్ పొత్తు వంటి అంశాలను ముందుకు వేస్తూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను కూడా పట్టించుకోలేదన్న విశ్లేషణలకు ఇప్పుడు వెంకయ్య మాటలతో మరింత ప్రాధాన్యత దక్కుతూ ఉండటం గమనార్హం!