యూపీ అందం.. మిస్ యూనివర్స్ పోటీకి వెళ్లనుంది
మరో కొత్తందం మెరిసింది. ముంబయిలో తాజాగా జరిగిన మిస్ ఇండియా యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచింది ఉత్తరప్రదేశ్ కు చెందిన వర్తికా సింగ్. ఈ విజయంతో ఇండియా తరఫున 2019 మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది.
లక్నోలో పుట్టిన ఈ బ్యూటీ పెరిగిందంతా మాత్రం మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్ లోనే. మోడలింగ్ ను కెరీర్ గా తీసుకొని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసిన వర్తికా.. ఎట్టకేలకు తాను అనుకున్న స్థానానికి చేరుకుంది. 2014 నుంచి వరుస పెట్టి పోటీల్లో పాల్గొంటున్నా.. ఆమెకు కలిసి రాలేదు.
2015లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ లో రన్నరప్ గా నిలిచిన ఆమె.. 2016లో హాటెస్ట్ ఉమెన్ గుర్తింపు పొందింది. 2017లో కింగ్ పిషర్ క్యాలెండర్ మీద మెరిసిన ఈ బ్యూటీ విద్యార్హత విషయాల్లోకి వెళితే.. క్లినికల్ న్యూట్రిషన్ లో డిగ్రీ చేసింది.
పబ్లిక్ హెల్త్ లోనూ పీజీ చేసిన వర్తికా అందమే కాదు.. తాను చేసే పనులతో మనసుల్ని దోచేస్తుంది. ఇప్పటికే ఒక ఎన్జీవోను నడుపుతోంది. ఫ్యూర్ హ్యూమన్స్ పేరుతో నిర్వహిస్తున్న ఈ సంస్థ పలు కార్యక్రమాల్ని చురుగ్గా నిర్వహిస్తుందన్న పేరుంది.
తాజాగా నిర్వహించిన మిస్ ఇండియా యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచిన నేపథ్యంలో ఆమెకు 2018 విజేత నేహా్ల్ చూడాస్మా కిరీటాన్ని పెట్టింది. మిస్ యూనివర్స్ పోటీలు ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై స్పష్టత లేదు. కాకుంటే.. ఆ పోటీల్లో పాల్గొనేందుకు ఆమె ప్రయత్నాలు మొదలెట్టింది. ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె.. కాస్త టెన్షన్ తో ఉన్నట్లు చెప్పారు.
మిస్ యూనివర్స్ పోటీలో గెలుపు కోసం తాను ప్రయత్నిస్తానని.. గతంలో పాల్గొన్న పోటీల అనుభవంతో విజేత కావటానికి అవకాశం ఉందన్న ధీమాను ఆమె వ్యక్తం చేస్తున్నారు. మరి.. ప్రపంచ వేదిక మీద భారత అందం వర్తికా పేరుతో మెరుస్తుందేమో చూడాలి.