లారీల్లో పశువుల్లాగా బస్సులో జనాలు.. ఇండిగోపై నరేష్ నిప్పులు!
వివరాళ్లోకి వెళ్తే... తాజాగా ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్న నరేష్.. ఆ విమానం ఎక్కెందుకు ఎయిర్ పోర్టు నుంచి ఏర్పాటు చేసిన బస్సులో ఎక్కారు.;
ఇటీవల కాలంలో విమానయాన సంస్థలపై వరుస ఫిర్యాదులు వెళ్లువెత్తుతున్న సంగతి తెలిసిందే! పైగా.. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో అన్నట్లుగా ఇటీవల దేశంలోని టాప్ ఎయిర్ లైన్స్ సంస్థలు పోటీ పడుతు వార్తల్లో నిలుస్తున్నాయి! గతంలో అహ్మదాబాద్ లో ఘోర ప్రమాధానికి గురవ్వడంతో తీవ్ర స్థాయిలో ఎయిరిండియా వార్తల్లో నిలవగా.. ఇటీవల ఇండిగో సైతం హాట్ టాపిక్ గా మారింది.
ఇండిగో వ్యవహారం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు సందేహాలు తెరపైకి వచ్చాయి. కేవలం రెండే సంస్థలు దేశంలోని విమానయానాన్ని మొత్తం చేతుల్లో పెట్టుకున్నాయని.. కేవలం ఒక్క సంస్థ ఇబ్బందుల్లోకి వెళ్లినంత మాత్రాన్న 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశం స్థంభించిపోవడం సరైన సంకేతం కాదని కథనాలొచ్చాయి.
ఇలా ఇటీవల భారీ సమస్యతో కొట్టుమిట్టాడిన ఇండిగో విమానయాన సంస్థపై టాలీవుడ్ సీనియర్ నటుడు ఒకరు నిప్పులు చెరిగారు. విమానయాన సంస్థకు చెందిన బస్సులో ప్రయాణికులను లారీల్లో పశువులను కుక్కినట్లు కుక్కారని మండిపడ్డారు. దీనిపై లీగల్ యాక్షన్ కి వెళ్లే విషయంలో తాను లీగల్ టీమ్ తో మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఇది వైరల్ గా మారింది.
అవును... టాలీవుడ్ సీనియర్ నటుడు, సీనియర్ నరేష్.. తాజాగా ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా.. ఇండిగో విమనం ఎక్కేందుకు ఎయిర్ పోర్ట్ నుంచి ఏర్పాటు చేసిన బస్సులో విపరీతంగా ప్రయాణికుల్ని కుక్కేశారంటూ ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో సీనియర్ సిటిజన్స్ పడిన ఇబ్బందులను ప్రత్యేకంగా ప్రస్థావించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
వివరాళ్లోకి వెళ్తే... తాజాగా ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్న నరేష్.. ఆ విమానం ఎక్కెందుకు ఎయిర్ పోర్టు నుంచి ఏర్పాటు చేసిన బస్సులో ఎక్కారు. ఆ సమయంలో ఆయనకు సీటు దొరికింది. అయితే.. ఒకేసారి ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఆ బస్సులోకి రావడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.. తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు తెలుస్తోంది.
ఈ విషయాలను ఎక్స్ వేదికగా పంచుకున్న ఆయన... ఎయిర్ లైన్స్ బస్సు టార్చర్ ఛాంబర్ లు ఎయిర్ లైన్ గుత్తాధిపత్యాన్ని గుర్తుచేస్తాయని తెలిపిన నరేష్.. మీరు మమ్మల్ని పశువులుగా (సామర్థ్యానికి రెండు రెట్లు) సీనియర్ సిటిజన్లతో సహా ఎక్కించారని అన్న్నారు. కొంతమంది వీల్ చైర్ లలో ఉండటానికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
ఈ సమయంలో ఓవర్ లోడ్ చేయడాన్ని తాను గట్టిగా అరిచానని తెలిపారు. బస్సులకు ఒక నిర్ధిష్టమైన పరిమితి, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక స్థలం ఉండాలని అన్నారు. దీనిపై చట్టబద్ధంగా ముందుకు వెళ్లేందుకు తాను తన లీగల్ టీమ్ తో మాట్లాడుతున్నానని నరేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.