కరోనా నుండి కోలుకున్న వకీల్ సాబ్ !

Update: 2021-05-08 09:30 GMT
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కొద్దిరోజుల క్రితం కరోనా సోకిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు వారాలుగా ఆయన తన ఫామ్ హౌస్ లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి న్యూస్ లేకపోవడంతో జనసేన కార్యకర్తలతో పాటు పవన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, వారందరికీ పవన్ కళ్యాణ్ శుభవార్త చెప్పారు. పవన్ కల్యాణ్ కరోనా నుంచి కోలుకున్నట్లు జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. మూడు రోజుల క్రితం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టులో ఆయనకు నెగెటివ్ వచ్చింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బాగానే ఆరోగ్యంగానే ఉన్నారని , కాకపోతే కాస్త నీరసంగా ఉన్నరని జనసేన తెలిపింది. తిరుపతి ఉపఎన్నిక ప్రచారం, వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పవన్ కరోనా బారిన పడ్డారు. తొలుత ఆయన సెక్యూరిటీ సిబ్బందికి వైరస్ సోకింది. తర్వాత పవన్ కు కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్పటి నుంచి పవన్ కల్యాణ్ తన సొంత వ్యవసాయక్షేత్రంలో చికిత్స తీసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కు వ్యక్తిగత వైద్యుడితో పాటు అపోలో హాస్పిటల్స్ కు చెందిన వైద్య బృందం ట్రీట్ మెంట్ అందించింది. తాజాగా పవన్ కు నెగెటివ్ రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఐతే పవన్ కు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.  మరోవైపు తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతిఒక్కరికీ పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ వైద్యులు ఇచ్చే సూచనలు పాటించాలని పవన్  చెప్పారు.
Tags:    

Similar News