ఇదిగిదిగో.. కిమ్ వార‌సురాలు... ఉత్త‌ర కొరియా కాబోయే రాణి

ఉత్త‌ర కొరియాలో ఏం జ‌రుగుతుందో బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌దు. విదేశీ నిఘా వ‌ర్గాలు ప‌సిగ‌ట్టి బ‌య‌ట‌పెడితే త‌ప్ప‌.;

Update: 2026-01-02 06:58 GMT

ఉత్త‌ర కొరియా.. ప్ర‌పంచానికి కొరుకుడు ప‌డ‌ని నియంత కిమ్ జోంగ్ ఉన్ పాల‌న‌లో 15 ఏళ్లుగా మ‌గ్గుతున్న దేశం.. మిగ‌తా దేశాలు ఏం అనుకుంటున్నాయో అత‌డికి ప‌నిలేదు.. తీవ్ర‌మైన నిబంధ‌న‌లు.. ఆయుధ ప‌రీక్ష‌లు.. ఇలా త‌న‌కు ఏది తోస్తే అది చేసేయ‌డ‌మే..! అయితే, కొంత‌కాలంగా కిమ్ ఆరోగ్యంపై వ‌దంతులు వ్యాపిస్తున్నాయి. అందుకే అత‌డు బ‌య‌టి ప్ర‌పంచానికి క‌నిపించ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. త‌న త‌ర్వాతి త‌రం వార‌సుల‌ను కిమ్ సిద్ధం చేస్తున్న‌ట్లుగానూ తెలుస్తోంది. తాజాగా ఆయ‌న రెండో సంతానం అయిన కుమార్తె జిమ్ యే తెర‌పైకి వ‌చ్చారు. త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఆమె దేశ మాజీ నేత‌ల స్మార‌కం కుమ్ సుస‌న్ వ‌ద్ద నివాళులు అర్పించారు. ఇదే కాదు.. మూడేళ్లుగా తండ్రి కిమ్ తో క‌లిసి ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటోంది జిమ్ యే. అటు కిమ్ కూడా త‌న బిడ్డ‌ను త‌ర‌చూ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు తీసుకెల్తున్నారు. దేశంలో ప‌లు అధికారిక కార్య‌క్ర‌మాల్లోనూ కుమార్తెకు చోటిస్తున్నారు కిమ్. దీంతో ఉత్త‌ర‌కొరియా కాబోయే రాణి ఆమెనే అని.. అది కూడా త్వ‌ర‌లోనే జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు.

ఫ్యామిలీ అంతా బ‌య‌ట‌కు..

ఉత్త‌ర కొరియాలో ఏం జ‌రుగుతుందో బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌దు. విదేశీ నిఘా వ‌ర్గాలు ప‌సిగ‌ట్టి బ‌య‌ట‌పెడితే త‌ప్ప‌. ఇప్పుడు ఇలానే ఆ దేశంలో అధికార మార్పిడి కూడా జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. కొత్త సంవ‌త్స‌రం నేప‌థ్యంలో కిమ్ త‌న భార్య రిసోల్ జుతో పాటు కుమార్తె జిమ్ యేతో క‌లిసి దేశ మాజీ నేత‌ల‌కు నివాళులు అర్పించాడు. ఇక కిమ్ ఇత‌ర దేశాల్లో ప‌ర్య‌టించ‌డం చాలా అరుదు. ర‌ష్యా లేదా చైనాలో మాత్ర‌మే టూర్లు చేస్తుంటారు. ఇలా గ‌త ఏడాది చైనా వెళ్లిన స‌మ‌యంలో త‌న కుమార్తె జిమ్ ను కూడా తీసుకెళ్లారు. అయితే, కిమ్ భార్య పేరు రిసోలో జు అని ఇప్పుడు అంద‌రికీ తెలిసింది.

తాత.. తండ్రి..నాన్న‌.. మ‌న‌వ‌రాలు..!

కిమ్ ఇల్-సంగ్, కిమ్ జోంగ్-ఇల్, కిమ్ జోంగ్-ఉన్... మూడు త‌రాలుగా ఉత్తర కొరియాను పాలిస్తున్న కిమ్ రాజవంశం. వ్యవస్థాపకుడు కిమ్ ఇల్-సంగ్, ఆయ‌న‌ కుమారుడు కిమ్ జోంగ్-ఇల్ ఆయ‌న కుమారుడు కిమ్ జోంగ్-ఉన్. వాస్త‌వానికి ఉత్త‌ర కొరియా క‌మ్యూనిస్టు దేశం అని చెప్పుకొంటుంది. కానీ, 80 ఏళ్ల‌కు పైగా అక్క‌డ కిమ్ వంశ‌స్తుల నియంత పాల‌న సాగుతోంది. ఈ క్ర‌మంలో తొలిసారిగా మ‌హిళ‌.. కిమ్ కూతురు కిమ్ జు యేకు ప‌గ్గాలు ద‌క్క‌నున్న‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. 2022 నుంచి ఈమెను కిమ్ త‌ర‌చూ ప్ర‌మోట్ చేస్తున్నారు. కాగా, కిమ్ కు ఒక కుమారుడు కూడా ఉన్న‌ప్ప‌టికీ అత‌డు ఎప్పుడూ బ‌య‌ట‌కు క‌నిపించింది లేదు. ఇద్ద‌రు కూతుళ్లలో కిమ్ జు యే మాత్రం తెర‌పైకి వ‌స్తోంది. ఈమె రెండో సంతానం. కిమ్ జోంగ్ ఉన్ 2011లో ఉత్త‌ర కొరియా ప‌గ్గాలు చేప‌ట్టారు.

Tags:    

Similar News