2026...ప్రపంచానికి పెద్ద ముప్పు..బాబా వాంగ షాకింగ్ భవిష్యవాణి

బాబా వాంగ బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని. ఈవిడ జోస్యం చాలా సందర్భాలలో నిజమైంది.;

Update: 2026-01-02 05:34 GMT

2026 కొత్త సంవత్సరం వచ్చి కేవలం కొన్ని గంటలే అవుతున్న సందర్భంలో...ఈ ఏడు ఎలా ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇండియా...పాకిస్తాన్ మధ్య సయోధ్య కుదురుతుందా? లేదా? రష్యా ఉక్రెయిన్ వార్ ఓ కొలిక్కి వస్తుందా? అమెరికా దుందుడుకు చర్యలు ఆసియా దేశాలపై ఏమేరకు ప్రభావం చూపనున్నాయి? అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఈ ఆసక్తికర ప్రశ్నలు సందేహాలకు బాబా వాంగ షాకింగ్ జోస్యం చెప్పారు. 2026 కచ్చితంగా అశాంతి నామ సంవత్సరమే అంటున్నారు. యుద్ధాలు, ప్రకృతి ప్రకోపాలు ప్రపంచానికి ముప్పుగా మారనున్నాయి అంటూ బాబా వంగ భయంకర భవిష్యవాణిలో చెబుతున్నారు.

బాబా వాంగ బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని. ఈవిడ జోస్యం చాలా సందర్భాలలో నిజమైంది. బాబా వాంగ భౌతికంగా లేకపోయినా...ఆమె చెప్పిన మాటలు నిజమవుతుండడంతో ధనవంతులు, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఆమె భవిష్యత్తు వాణిని నమ్ముతున్నారు. ప్రస్తుతం 2026కు సంబంధించి బాబా వాంగ జోస్యం ప్రకారం ప్రపంచానికి పెను విపత్తు పొంచి ఉందనే చెప్పాలి. యుద్దాలు, ప్రాకృతిక విపత్తులతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణ కోల్పోవడం వల్ల కలిగే అనర్థాలు, ఇతర గ్రహాలయుద్దాలు 2026లోనే సంభవించే అవకాశాలున్నట్లు వాంగ వాణి వల్ల తెలుస్తోంది. బాబా వాంగ అంధురాలు అయినా...ఆమె తెలిపిన మాటలు చాలా వరకు నిజమయ్యాయి. రాకుమారి డయానా మరణం మొదలు కోవిడ్ 19 విపత్తు, దేశాల మధ్య యుద్దాలు, ఇలా పలు ప్రముఖ అంశాల్లో వాంగ చెప్పిందే నిజమవుతూ వచ్చింది. అందుకే 2026 సంవత్సరం భవిష్యత్తు గురించి ఆమె తెలిపిన వాణి సంచలనం రేకెత్తిస్తోంది.

షాకింగ్ భవిష్యవాణి చెప్పిన ఈ బాబా వాంగ ఎవరు? ఎక్కడ పుట్టారు? తదితర సందేహాలు ఇపుడు పాఠకుల్లో తలెత్తుతున్నాయి. బాబా వాంగ 1911లో బల్గేరియాలో జన్మించారు. అంధురాలైన ఈవిడ అసలు పేరు వాంజిలియా పాండేవా గుశ్వరోవా. 20 వశతాబ్దపు నిగూఢ భవిష్య వాణి ప్రవక్తగా బాబా వాంగను గుర్తిస్తారు. వాంగ తన 12వ ఏట చూపు పోగొట్టుకున్నారు. 1996లో తమ 86వ ఏట బాబా వాంగ మరణించారు. ఇప్పటికీ బాబా వాంగ భవిష్యవాణిని నమ్మేవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. విశేషమేంటంటే...బాబా వాంగ లిఖితపూర్వకంగా వాణి చెప్పలేదు. ఆమె తమ అనుయాయులకు అందించిన వాణే తరతరాలుగా ముందుకు వస్తోంది.

ఈ సంవత్సరం యుద్ద భయాలు హెచ్చు...ప్రపంచ పూర్వ ప్రాంతంలో ప్రారంభమయ్యే యుద్దాల ప్రభావాలు, పరిణామాలు పశ్చిమ దేశాలకు పాకే ప్రమాదముంది. పశ్చిమ దేశాలకు పాకే ఈ యుద్ధాల వల్ల ఆస్తి,ప్రాణ నష్టాలు అపారంగా ఉండే అవకాశాలున్నాయని బాబా వాంగ అంటున్నారు. అలాగే రష్యాకు చెందిన ప్రముఖ నాయకుడి ప్రభావం ప్రపంచంపై పడనుందని, రానున్న కాలంలో రష్యా కీలకంగా మారబోతోందని ప్రపంచ సమతుల్యాన్ని ఈ దేశమే నిర్ణయిస్తుందని బాబా వాంగ వాణి ద్వారా చెబుతున్నారు. అలాగే ఈ సంవత్సరం ఎన్నో ప్రకృతి విపత్తుల్ని ప్రపంచం ఎదుర్కొనబోతోందని, భూకంపాలు, భయంకర అగ్నిప్రమాదాలు, అతివృష్టి తదితర ఘటనలు జరుగుతాయని బాబా వాంగ తెలిపారు.

ప్రపంచాన్నే శాసించే దిశగా అడుగులేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఈ సంవత్సరం అనూహ్యంగా మానవ జీవితంలో చొచ్చుకుపోతుందని, నియంత్రణ కోల్పోవడంతో అదే ప్రమాదకారిగా మారే సందర్భాలు ఎదురవుతాయని బాబా వాంగ అంటున్నారు. ఆమె వాణి ప్రకారం రానున్న కాలంలో ఏఐ ఇక మానవ ఆదేశాల కోసం ఎదురు చూడదు. తన నిర్ణయాలు తనే తీసుకుంటుంది...అదే అసలు ముప్పుగా మారుతుందని బాబా వాంగ తెలిపారు. యాంత్రికత... నైతికత మధ్య అనునిత్యం సంఘర్షణ తప్పదని అంటున్నారు. అలాగే 2026లో భూగ్రహానికి ఇతర గ్రహాలకు మధ్య సంబంధాలు ఈ ఏడు మొదలయ్యే అవకాశాలున్నాయి. అన్యగ్రహ వాసులు నేరుగా భూవాసుల్ని కలుసుకుంటారు. ఈ విశాల విశ్వంలో మనిషి ఒకరే కాదు మనుషులను పోలిన ఇతర గ్రహాంతర వాసులున్నారని తేలుతుంది. ఏలియన్స్ ను పోలిన జీవులు వ్యోమనౌకల ద్వారా భూమిపై దిగుతారని బాబా వాంగ ఆశ్చర్యకరమైన వాణి తెలిపారు.

బాబా వాంగ మనమధ్య లేకపోయినా...ఆమె ప్రవచించిన వాణిగా ఆమె శిష్యులు చలామణి చేస్తున్న మాటలు ఇపుడు సంచలనంగా మారుతున్నాయి. ప్రత్యేకించి 2026లో విపత్తులు తప్పవు అన్న భవిష్యవాణి ప్రపంచ ప్రజల్ని ఉలిక్కి పడేలా చేస్తోంది. ఈ వాణి నిజమా? కాదా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది.

Tags:    

Similar News