పోయి.. పోయి వీహెచ్ తో పెట్టుకోవటం ఏమిటి రేవంత్?
కాంగ్రెస్ పార్టీ గురించి తరచూ ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. వారిని ఎవరో ఓడించనక్కర్లేదని.. వారిని వారే ఓడించుకునే సిత్రమైన ధోరణి కనిపిస్తుంది. ఓవైపు పార్టీ ఉనికి కోసం కిందామీదా పడుతున్న వేళ.. ఇప్పటికి ముఖ్యనేతల్లో మార్పు రాని తీరు ఖమ్మంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే ఇట్టే అర్థ కాక మానదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని పార్టీలో చేర్చుకునే తీరుపై కాంగ్రెస్ పార్టీలో మొదట్నించి కొంత అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. అంతే కాదు.. నిత్యం నేతల మధ్య ఏదో ఒక స్ట్రీట్ పంచాయితీ మాదిరిహాట్ హాట్ వ్యాఖ్యలు.. విమర్శలు చేసుకోవటం వారికి అలవాటు.
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ పార్టీకి దారుణంగా దెబ్బ తీసినప్పటికి.. ఆ పార్టీ నేతల మధ్య ఎలాంటి రిలేషన్స్ ఉంటాయనటానికినిదర్శనంగా ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చోటు చేసుకుంది. పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క చేపట్టిన రైతు పోలిక కేక సభలో విబేధాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎంపీ రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ.. మాజీ ఎంపీ వీహెచ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి టిక్కెట్లు ఇవ్వొద్దన్నారు.పార్టీని నమ్మకున్న వారికే టికెట్లు ఇవ్వాలని వీహెచ్ ఫంచ్ లు వేశారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్ లో అమ్ముడుపోయేవారిని ఏరివేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. అంతేకాదు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాల్ని వెనుకబడిన కులాల వారికి అప్పజెప్పాలన్నారు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా.. తుది పలితమే ముఖ్యమని చెప్పారు.
దుబ్బాకలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యం కాంగ్రెస్ పార్టీకి కరెంటు షాక్ కొట్టేలా చేశాయి. ఉనికి కూడా లేనట్లుగా మూడో స్థానానికి పరిమితం కావటం ఏమిటి అన్నది ఒక ప్రశ్న అయితే.. ఇలాంటి వేళ.. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలంటే.. సరైన అభ్యర్థుల్ని ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది.
మరి.. గ్రేటర్ ఎన్నికల వేళకు పోటాపోటీగా పోటీ చేసేలా..కాంగ్రెస్ అభ్యర్థుల్ని సిద్ధం చేయాలని భావిస్తున్నారు.ఇలాంటి వేళ.. ఒకే పార్టీకి చెందిన సీనియర్లు.. జూనియర్లు ముఖాముఖిన తిట్టుకోవటం పార్టీ వర్గాల్లో సంచలనంగా మారింది. వీహెచ్ నోటికి పని చెబితే.. హుందాగా ఊరుకోవాల్సిన రేవంత్.. విరుచుకుపడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న చిన్న విషయాన్ని ఫైర్ బ్రాండ్ ఎందుకు అర్థం చేసుకోనట్లు..?