బెంగాల్‌లో అసలు కథ సెకండ్ ఫేజే!
ప్రధానంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించాలన్న గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ కీలకమైన 5 అంశాలను ప రిగణనలోకి తీసుకుని ముందుకు సాగుతోంది.;
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రాజకీయం మరింద దుమారంగా మారింది. ప్రస్తుతం గురువారం తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడతలో 152 స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రజలు తేల్చనున్నారు. అయితే.. అసలు కథంతా రెండో విడతపైనే ఉంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న బెంగాల్‌లో రెండో దశ ఎన్నికల పోలింగ్ ఈ నెల 29న జరగనుంది. ఈ దశలో కీలకమైన సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే సువేందు అధికారి సహా.. మరింత మంది ముఖ్య నాయకుల జాతకం తేలనుంది.
ప్రధానంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించాలన్న గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ కీలకమైన 5 అంశాలను ప రిగణనలోకి తీసుకుని ముందుకు సాగుతోంది. దీనిలో
1) పరివారం పాలన: అంటే.. మమతా బెనర్జీ కుటుంబ రాజకీయాలు చేస్తున్నారన్న వాదనను బలంగా వినిపిస్తోంది. వాస్తవానికి ఆమె అవివాహిత . అయితే.. తన సొదరుల కుమారులను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. మేనల్లుడు కళ్యాణ్ బెనర్జీ ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తున్నాడు.
2) శారదా చిట్ ఫండ్ సహా.. బొగ్గు గనుల కుంభకోణం: ఈ విషయాన్ని బీజేపీ భారీగా ప్రచారంలోకి తీసు కుంవచ్చింది. ముఖ్యంగా ఐప్యాక్ కు బొగ్గు గనులు రాసిచ్చారన్న వాదన వినిపిస్తోంది. 3) మహిళా బిల్లు: సీఎం మమతా బెనర్జీ మహిళ అయి ఉండి కూడా.. మహిళలకు మద్దతు ఇవ్వడం లేదేని.. పార్లమెంటులో బిల్లు వీగిపోయేలా చేశారని బీజేపీనాయకులు విమర్శిస్తున్నారు. వాస్తవం ఏంటంటే.. దేశవ్యాప్త రిజర్వేషన్ ఎలా ఉన్నా.. మమతా బెనర్జీ.. తన పార్టీకి చెందిన మహిళలకు 42 శాతం మందికి తాజా ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు.
4) బంగ్లాదేశీ చొరబాట్లు: బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు పెరుగుతున్నాయని.. ఇదంతా ఓటు బ్యాంకు కోసం మమత ఆడుతున్న నాటకమని బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. 5) సర్ వివాదం: రాష్ట్రంలో పెద్ద దుమారం రేపిన ప్రత్యేక ఓట్ల సర్వేపై మమత యాగీ చేస్తున్నారని.. మమత కారణంగానే ఓటర్లు తమ ఓట్లు కోల్పోతున్నారని బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది. అయితే.. తొలి దశలో సంక్షేమాన్ని నమ్ముకున్న బీజేపీ.. ఈ దశలో మాత్రంపూర్తిగా మమత వ్యతిరేక ఓటుపైనే ఆశలు పెట్టుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.