టీడీపీ వర్సెస్ వైసీపీ: అంతులేని వివాదాలు.. !
అంతర్గత వివాదాలు.. ఏ పార్టీలో అయినా సహజమే. అయితే.. అవి రోడ్డెక్కకుండా చూసుకోవాలి. నేతలు రోడ్డెక్కితే దాని పర్యవసానాలు కూడా అలానే ఉంటాయి.
అంతర్గత వివాదాలు.. ఏ పార్టీలో అయినా సహజమే. అయితే.. అవి రోడ్డెక్కకుండా చూసుకోవాలి. నేతలు రోడ్డెక్కితే దాని పర్యవసానాలు కూడా అలానే ఉంటాయి. ఈ విషయంలో వైసీపీ-టీడీపీల మధ్య పెద్దగా తేడా కనిపించడం లేదు. నేతలు రోడ్డెక్కడం.. సొంత పార్టీపైనే విమర్శలు చేయడం కామన్‌గా మారిపోయింది. టీడీపీలో ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం తెలిసిందే. అయితే.. వారిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడా కట్టు తప్పకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇది ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుందన్నది చూడాలి. ప్రస్తుతానికి చంద్రబాబు ఈ విసయంలో జోక్యం చేసుకుంటున్నారు. దారి తప్పుతున్న ఎమ్మెల్యేలకు సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు.. వారికి హెచ్చ రికలు కూడా చేస్తున్నారు. దీంతో ఎగిరెగిరి పడుతున్న నాయకులు కొంత వరకు సర్దుకుంటున్నారు. ఇక, వైసీపీ విషయానికి వస్తే.. ఈ తరహా ప్రయత్నాలు చేయడం లేదు. గత పాత విధానంలోనే జగన్ ఇంకా ఉన్నారన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట.
దీంతో నాయకులకు కనీసం పరామర్శలు, బుజ్జగింపులు కూడా లేకుండా పోయాయి. ఫలితంగా వివాదా ల్లో చిక్కుకున్న నాయకులు తమంతట తాము మారడమో.. లేక పార్టీని వదిలి పోవడమో తప్ప.. మరో మార్గం లేకుండా పోయింది. ఉమ్మడి అనంతపురంలో మాజీ ఎంపీకి.. స్థానిక నేతలకు ఏమాత్రం పడడం లేదు. ఆధిపత్య ధోరణితో మాజీ ఎంపీ వ్యవహరిస్తున్నారని సీనియర్లు చెబుతున్నారు. ఇక, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంతో వైసీపీలో నాయకులు ఇబ్బంది పడుతున్నారన్నది వాస్తవం.
ఏం చేస్తారు..?
ఈ విషయాలపై వైసీపీ చర్చించడం లేదా? అంటే.. చర్చిస్తోంది. కానీ, నాయకుల అభిప్రాయాల కంటే కూడా.. అధినేత నిర్ణయమే ఫైనల్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నా.. అసలు నాయకుల అభిప్రాయాలను కూడా వినేందుకు ముందుకు రావడం లేదు. దీంతో వైసీపీలో తీవ్ర గందరగోళం అయితే నెలకొంది. మాజీ ఎంపీ నందిగం సురేష్.. ఈ విషయంలోనే పార్టీకి దూరంగా ఉంటున్నారన్నది నిజం. ఇక, మాజీ మంత్రులు ఇద్దరు సైతం ఇదే బాటలో ఉన్నారు. ఇదే కొనసాగితే.. వైసీపీలో సీనియర్లు తప్పుకొంటారు. కానీ, ఇది మేలు చేస్తుందా? అనేది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు.