బాబు జగన్ "ఢీ"ఎస్సీ...ఎండ్ కార్డు అప్పుడే ?

ఏపీలో మెగా డీఎస్సీకి సంబంధించిన రాజకీయం కాస్తా పీక్స్ కి చేరుకుంది. విజయవాడ శాప్ కార్యాలయం ముందు వైసీపీ నిరసనకు దిగడంతో ఇది మరింతగా రాజుకుంది.

Update: 2026-09-22 02:39 GMT

ఏపీలో మెగా డీఎస్సీకి సంబంధించిన రాజకీయం కాస్తా పీక్స్ కి చేరుకుంది. విజయవాడ శాప్ కార్యాలయం ముందు వైసీపీ నిరసనకు దిగడంతో ఇది మరింతగా రాజుకుంది. దీంతో డీఎస్సీ ప్రకంపనలు రాజకీయంగా మరో లెవెల్ కి చేరుకున్నాయి. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు తొలిసారి డీఎస్సీ మీద అల్టిమేట్ స్టేట్ మెంట్ ఇచ్చారు. తాను అధికారంలో ఉండగా డీఎస్సీలో అక్రమాలు జరిగేందుకు వీలే లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ఏకంగా 16 వేల పై చిలుకు టీచర్ పోస్టులను భర్తీ చేసింది అన్నారు. దానికి 140 రోజుల సమయంలో పూర్తి చేశామని అన్నారు. డీఎస్సీలను ఎక్కువగా తీసింది టీడీపీ మాత్రమే అని ఆయన గుర్తు చేశారు. వైసీపీ చేస్తున్న రాద్ధాంతం మీద ఆయన ఫైర్ అయ్యారు.

అసెంబ్లీకి వస్తే చెప్తాం :

డీఎస్సీల మీద ఎన్ని డౌట్లు ఉన్నా అసెంబ్లీకి వస్తే తాము స్పష్టంగా అన్నీ చెబుతామని అన్నారు. నిజం నిగ్గు తేలుస్తామని అన్నారు. డీఎస్సీ మీద లేని పోని నిందలు మోపుతున్నారని బాబు మండిపడ్డారు. అరాచకాలు సృష్టిద్దామనుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. డీఎస్సీ ఆందోళన పేరుతో వైసీపీ చేస్తున్నది అంతా రాజకీయమే అని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ చేయలేక ఇలాంటి తప్పుడు ఆరోపణలతో జనాలను మభ్యపెట్టాలని చూస్తున్నారు అని బాబు ఫైర్ అయ్యారు. డీఎస్సీ మీద అంతా ఓపెన్ గానే ఉందని వైసీపీ యాగీ చేయాలని చూస్తే ఊరుకునేది లేదని బిగ్ వార్నింగ్ ఇచ్చారు.

సీబీఐ అంటే ఉలుకెందుకు :

అయితే వైసీపీ అధినేత జగన్ కూడా అంతే స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన సోషల్ మీడియా వేదికగా డీఎస్సీ మీద సీబీఐ ని వేయాలని మరోసారి డిమాండ్ చేశారు. డీఎస్సీ మీద విచారణకు భయమెందుకు అని చంద్రబాబుని ప్రశ్నించారు. మీకు మీరే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. నిజాలు నిగ్గు తేల్చాలంటే సీబీఐ ఒక్కటే మార్గం అని జగన్ అన్నారు. తప్పు చేయకపోతే ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అని జగన్ నిలదీశారు. ఈ విషయంలో వైసీపీ తగ్గేది లేదని స్పష్టం చేశారు. సీబీఐ విచారణ జరగాలని లోకేష్ విద్యా మంత్రిగా రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేయడం విశేషం.

ఎన్నికల అస్త్రంగానే :

ఏపీలో చూస్తే మెగా డీఎస్సీ వివాదం ఇప్పట్లో ఆగేది లేదని అర్ధం అవుతోంది. ఇందులో విద్యా శాఖ మంత్రిగా లోకేష్ పాత్ర ఉంది అని వైసీపీ ఆరోపించడమే దీనిని కారణం. కాబోయే సీఎం గా లోకేష్ కూటమిలో ఉన్నారు. ఆయన్ని మంత్రిగానే కార్నర్ చేయడానికి డీఎస్సీ ఒక కీలక ఆయుధంగా వైసీపీ భావిస్తోంది. దీనినే జనం ముందు పెట్టి మంత్రిగా ఆయన చేసినది ఇది అంటూ గట్టిగా చాటాలని అనుకుంటోంది. నిజానికి ఇదే కూటమిలో విద్యా శాఖ మంత్రిగా మరొకరు ఉంటే దీనిని ఇంతటి రాజకీయ ప్రాధాన్యత వచ్చేది కాదని అంటున్నారు. అక్కడ లోకేష్ ఉండడంతోనే వైసీపీలో రాజకీయ పట్టుదల పెరిగిపోతోంది అని అంటున్నారు. లోకేష్ ని ఈ విషయంలో దోషిగా చూపించాలన్నది వైసీపీ ఆలోచన

అయితే అదే సమయంలో టీడీపీ కూడా ప్రతి వ్యూహాలతో ముందుకు రావడంతో ఏపీలో డీఎస్సీ సెగలూ పొగలూ కక్కుతోంది అంటున్నారు.

టీడీపీ బాధేనా :

ఇది ఇలా చూస్తే కనుక వచ్చే ఎన్నికల వరకూ సాగి 2029 ఎన్నికల వేళ కూడా ఈ ఇష్యూతోనే జనంలోకి వైసీపీ వెళ్లాలని చూస్తోంది అంటున్నారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వంలో లోకేష్ మీద ఈ విధంగా వైసీపీ విమర్శలు చేస్తూ ఉంటే ధీటుగా స్పందించే మంత్రులు కూడా ఎక్కువగా కనిపించడం లేదని అంటున్నారు. మరో వైపు మిత్రులు ఈ విషయంలో పెద్దగా స్పందించడం లేదని అంటున్నారు. మొత్తానికి లోకేష్ ఈ విషయంలో ఇప్పటికే అనేక మార్లు వివరణ ఇచ్చారు. ఆయన వీడియో పోస్టులు పెట్టారు, ఇక చంద్రబాబు అల్టిమేట్ అన్నట్లుగా కుప్పం సభలో గట్టిగానే రియాక్ట్ అయ్యారు. మరి దీనికి ఎండ్ కార్డ్ అన్నది అయితే ఇప్పట్లో పడే చాన్స్ లేదనే అంటున్నారు.

Tags:    

Similar News