అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ట్రంప్ , జో బిడెన్ .. ఎగ్జిట్ పోల్స్ ఎవరికి అనుకూలం .. !

Update: 2020-10-09 08:30 GMT
అతి త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. దీనితో అమెరికా మొత్తం ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా అమెరికా అధ్యక్షుడి ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షడిగా మళ్లీ ట్రంప్ గెలుస్తారా ? లేక జో బిడెన్ అధ్యక్షడిగా వైట్ హౌస్ లోకి అడుగుపెడతాడా ? అని అందరూ ఆతృతగా ఎదుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రచారంలో ఇద్దరు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష బరిలో ఎవరూ ముందు వరసలో ఉన్నారు..  ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయో చూద్దాం.

జో బిడెన్ 1970 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. బరాక్ ఒబామా నేతృత్వంలో ఉపాధ్యక్షుడిగా బిడెన్ వెలుగులోకి వచ్చారు. అయితే నాలుగేళ్లలో ట్రంప్ ప్రభుత్వం ఏమీ చేయలేదని.. కరోనా వైరస్ నియంత్రణ, వ్యాక్సిన్, ఆర్థిక మాంద్యం తదితర అంశాలపై ఫోకస్ చేశారు. అయితే ప్రెసిడెంట్ పోల్స్ ‌లో బిడెన్ ముందువరసలో ఉన్నారు. బిడెన్ 52 శాతం ఓట్లతో ఉండగా మొదటి ప్లేస్ లో కొనసాగుతుంటే , ట్రంప్ 42 శాతం ఓట్లతో ఉన్నారు. అయితే ఇదీ ఎన్నికల సమయం వరకు ఇలాగే కొనసాగుతుంది అని చెప్పలేము.  గతంలో హిల్లరీ క్లింటన్ ‌కు ఇలాగే జరిగింది అని  నిపుణులు సూచిస్తున్నారు.

2016లో హిల్లరీ క్లింటన్‌ కు ట్రంప్ కన్నా 3 మిలియన్ ఓట్లు ఎక్కువగా వచ్చాయి. కానీ అమెరికాలో గల ఎలక్టోరల్ కాలేజ్ సిస్టమ్‌ వల్ల ట్రంప్అధ్యక్షడిగా ఎన్నికైయ్యారు.   ఈ సారి కూడా అలా జరిగితే మరోసారి ట్రంప్ విజయం సాధించే అవకాశం ఉంది. కానీ విశ్లేషకులు మాత్రం ట్రంప్, బిడేన్‌లలో ఎవరూ విజయం సాధిస్తారనే అంశంపై కరెక్టుగా అంచనా వేసి చెప్పలేకపోతున్నారు. మిచిగాన్, పెన్సిల్వానియా, విస్‌ కోన్సిన్ రాష్ట్రాల్లో బిడెన్ లీడ్ ‌లో ఉన్నారు.  2016లో మాత్రం లోవా, ఓహియో, టెక్సాస్‌లో 8 నుంచి 10 శాతం ఓట్లతో ముందువరసలో ఉన్నారు. అయితే ఈ సారి మాత్రం ట్రంప్, బిడేన్ మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతోంది. అయితే, ఈ ఇద్దరిలో  ఎవరిదీ పై చేయి అంటే నవంబర్ 3 వరకు వేచి చూడక తప్పదు.
Tags:    

Similar News