టీడీపీ కేడర్‌కు 'ఈ-3'.. : చంద్రబాబు
రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్న పార్టీ అధినేత సీఎం చంద్రబాబు తాజాగా కేడర్ డెవల ప్‌మెంట్ కోసం.. ఈ-3 ఫార్ములాను ప్రకటించారు.;
రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్న పార్టీ అధినేత సీఎం చంద్రబాబు తాజాగా కేడర్ డెవల ప్‌మెంట్ కోసం.. ఈ-3 ఫార్ములాను ప్రకటించారు. ఎథికల్ -ఎకనమిక్ -ఎంపవర్మెంట్ అనే మూడు `ఈ`లతో ఈ కార్యక్రమాలు అమలు అవుతాయని పేర్కొన్నారు. వీటి ద్వారా కార్యకర్తలను, శ్రేణులను బలోపేతం చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఇస్తు న్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యతపూర్తిగా కార్యకర్తలపైనే ఉంటుందని తెలిపారు.
ప్రతి నెలా రెండో శనివారం.. పార్టీ కార్యకర్తలతో భేటీ అవుతున్న చంద్రబాబు.. తాజాగా మంగళగిరిలోనిటీడీపీ కేంద్ర కార్యాలయా నికి వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ క్లస్టర్ ఇంచార్జ్‌లతో ఆయన భేటీ అయ్యారు. వారితో కలిసి కాఫీ తాగుతూ.. `కాఫీ కబుర్లు` కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. వారి వ్యక్తిగత విషయాలు కూడా అడిగారు. అయితే.. ముందుగా కుటుంబాలకే ప్రాధాన్యం ఇవ్వాలని.. ఆర్థికంగా కుటుంబాలకు ఇబ్బంది లేకుండా చూసుకోవా లని సూచించారు. రాజకీయాల్లోకి వచ్చేది సంపాయించుకునేందుకు కాదన్న విషయాన్ని గుర్తించాలన్నారు.
పార్టీ కార్యకర్తల సంతోషమే తనకు ప్రాధాన్యమన్న ముఖ్యమంత్రి ఈ క్రమంలోనే `ఈ-3` కార్యక్రమాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రజల మధ్య ఉండేవారికే ప్రాధాన్యం ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు.. ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ కార్యకర్తల ఆర్థిక బలోపేతానికి ఈ-3 కార్యక్రమం అమలు చేస్తామన్నారు. ఎథికల్-ఎకనమిక్ -ఎంపవర్మెంట్ కార్య క్రమం చేపడతామని తెలిపారు.
నిజాయితీనే ముఖ్యం!
రాజకీయాల్లో నిజాయతీగా ఉంటేనే విలువ ఉంటుందని చంద్రబాబు సూచించారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు చేయాలి తప్ప.. ఆస్తులు సంపాయించుకునేందుకు కాదన్నారు. రాజకీయాలు జీవన ఉపాధి కూడా కాదని తేల్చి చెప్పారు. స్వచ్ఛమైన రాజకీయాలకు(క్లీన్ పాలిటిక్స్)కు టీడీపీని కేరాఫ్ అడ్రస్‌గా మార్చాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. క్వాంటం టెక్నాలజీతో ఏపీని, అమరావతిని అభివృద్ధి చేస్తున్నామన్న ఆయన.. ఈ నెల 14న `క్వాంటం టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీ`ని ప్రారంభించనున్నట్టు తెలిపారు.