ఢిల్లీ స్కూల్ లో సందడి చేసిన మెలానియ ట్రంప్
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా ఆయన భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మంగళవారం ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఢిల్లీలోని సర్వోదయ స్కూల్‌లో ‘హ్యాపినెస్ క్లాసు’ లను ఆమె పరిశీలించారు. హైదరాబాద్ హౌజ్ లో భారత ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరుపుతున్న సమయం లో మెలానియా ట్రంప్ ఢిల్లీలోని సర్వోదయ స్కూల్ ను సందర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు మెలానియాకు సాదర స్వాగతం పలికారు. భారతీయ సంప్రదాయ పద్దతిలో బొట్టు పెట్టి మంగళ హారతులతో మెలానియాను స్వాగతం పలకడంతో , ఆ చిన్నారుల స్వాగతాన్ని చూసిన మెలానియా మురిసిపోయారు. దాదాపు గంటపాటు అక్కడున్న చిన్నారులతో ఆమె గడిపారు. అనంతరం ఓ తరగతి గదిలోకి వెళ్లిన మెలానియా విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడి ‘హ్యాపీనెస్ క్లాస్’ నిర్వహణను అడిగి వివరంగా తెలుసుకున్నారు. ఆమె రాకతో ఆ స్కూల్‌లో పండుగ వాతావరణం నెలకొంది. మెలానియా సందర్శన నేపథ్యంలో స్కూల్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
అసలు హ్యాపినెస్ క్లాస్ రూమ్ అంటే..ఏమిటి అంటే .. రెండేళ్ల క్రితం ఢిల్లీ ప్రభుత్వం ఈ హ్యాపినెస్ కరిక్యూలమ్ ను రూపొందించింది. ఈ కరిక్యూలమ్ ను నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తారు. అయితే దీని ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, స్వీయ అవగాహన ను ఏర్పరచుకోవడంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించేలా పాఠ్యాంశాలు బోధిస్తారు.