• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమెరికా ఎన్నికల ఫలితాలు...

అమెరికా ఎన్నికల ఫలితాలు మరింత ఆలస్యం?

By - Tupaki Desk
Update: 2020-11-03 16:50 GMT
అమెరికా అధ్యక్ష  ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రెండోసారి అధ్యక్షుడు కావాలని  డొనాల్డ్ ట్రంప్ ఆశపడుతుండగా.. ఆయన ప్రత్యర్థి,  డెమొక్రాట్ జో బిడెన్ వైట్ హౌస్ లో ఈసారి అడుగుపెట్టాలని యోచిస్తున్నారు.  కరోనా దెబ్బతో చాలా ముందస్తు ఓటింగ్ వేయడం విశేషం.  98.7 మిలియన్లకు పైగా ప్రజలు తమ ఓట్లను మెయిల్ ద్వారా పంపారు.  మంగళవారం పోలింగ్ ప్రారంభమయ్యే కొన్ని గంటల ముందు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చివరి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికలలో "అద్భుత విజయం" తన సొంతమవుతుందని స్పష్టం చేశారు.  

అయితే, కోవిడ్ -19 మహమ్మారి కారణంగా చాలామంది అమెరికన్ ప్రజలు మెయిల్-ఇన్ ఓటింగ్ (పోస్టల్ బ్యాలెట్) ద్వారా ఓట్లను వేశారు. దీనివల్ల ఈ ఏడాది ఫలితాలను ప్రకటించడంలో ఆలస్యం అవుతుందని అంచనా వేస్తున్నారు. కరోనావైరస్ నేపథ్యంలో తమ ఓటు హక్కును మెయిల్ ద్వారా వినియోగించుకోవడం చాలా సురక్షితమని అమెరికన్లు ఇదే పద్ధతిలో ఈసారి ఓటు వేశారు. మీడియా నివేదిక ప్రకారం పోస్టల్ ఓట్లు భారీ సంఖ్యలో వచ్చాయని.. పోస్టల్ ఓట్లతో అభ్యర్థి ముందంజలో నిలువవచ్చని అంటున్నారు.

సాధారణంగా.. అమెరికాలో ఎన్నికల ఫలితాలు ఎన్నికల రోజు రాత్రి తెలుస్తాయి. పోలింగ్ జరిగిన కొద్ది గంటల్లోనే 270 ఎన్నికల ఓట్లను  ఏ అభ్యర్థి సాధించాడనేది చూచాయగా తెలుస్తుంది. ఈ సంవత్సరం పోస్టల్ ఓట్లను లెక్కించడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు కాబట్టి చాలా రాష్ట్రాల్లో ఫలితాలు ఆలస్యం అవుతాయని భావిస్తున్నారు.

అమెరికాలో ప్రస్తుతం మూడు ప్రాథమిక మార్గాల్లో ఓటింగ్ వేయవచ్చు. ఎన్నికల రోజున వ్యక్తిగతంగా, ఎన్నికలకు ముందు ముందస్తుగా వేయవచ్చు. ఇక మూడో ఆప్షన్ మెయిల్-ఇన్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చు.

వృద్ధులు.. తీవ్రమైన రోగాలతో బాధపడుతున్న వారు లేదా వారి రాష్ట్రానికి దూరంగా ఉన్నవారు పోస్టల్  ద్వారా ఓటు వేయడానికి అనుమతిస్తారు. పోస్టల్ ఓట్లు సాధారణ బ్యాలెట్ కంటే లెక్కించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ప్రతి ఓటుకు ఓటరు నమోదు కార్డుతో సరిపోలవలసిన సంతకం ఉండాలి. 2016 లో  తుది ఓట్లు మొత్తం లెక్కించడానికి ఒక నెల కన్నా ఎక్కువ సమయం పట్టింది. ఇక వేర్వేరు రాష్ట్రాల్లో వాటిని లెక్కించాలో వేర్వేరు నియమాలను ఉంటాయి. ఉదాహరణకు ఫ్లోరిడా వంటి రాష్ట్రాలు ఎన్నికల రోజుకు ముందు పోస్టల్ ఓట్లను లెక్కించడం ప్రారంభిస్తాయి. మరికొందరు పోలింగ్ జరిగే వరకు వాటిని లెక్కించడం ప్రారంభించరు.

అందువల్ల, ఓట్లు లెక్కించబడిన క్రమం ఆధారంగా ఎవరు లీడ్ లో ఉన్నారన్నది తేలుతుంది. డెమోక్రాట్లు ఈ సంవత్సరం మెయిల్ ద్వారా ఓటు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ మేరకు ప్రచారం చేశారు. అరిజోనా, ఫ్లోరిడా మరియు నార్త్ కరోలినా వంటి పోస్టల్ బ్యాలెట్లను మొదట లెక్కించే రాష్ట్రాలు మొదట్లో బిడెన్‌కు అనుకూలంగా మారవచ్చు. వర్జీనియా మాదిరిగా వ్యక్తిగతంగా ఎన్నికల రోజు ఓట్లను నివేదించే  రాష్ట్రాల్లో అధ్యక్షుడు ట్రంప్‌కు  ఎక్కువగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది.
Tags:    
  • US election 
  • US election results 
  • Political News 
  • Breaking News 
  • Tupaki News Tupaki Updates 
  • Tupaki 
  • Latest News 
  • Tupaki Media 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS