గడప గడప : వైసీపీ ఎమ్మెల్యేకు నోట మాట రాకుండా చేసిన మహిళలు

Update: 2022-05-16 04:42 GMT
ఏ మూహుర్తంలో డిసైడ్ చేశారో కానీ గడప గడపకు మన ప్రభుత్వం.. ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు.. ఆ పార్టీ ప్రజా ప్రతినిధులకు చుక్కలు చూపిస్తోంది. ఎన్నికలప్పుడు వచ్చారు.. మళ్లీ ఇప్పుడు వస్తున్నారంటూ నిలదీస్తున్న ప్రజలకు సమాధానం ఇవ్వలేక కిందా మీదా పడిపోతున్నారు.

ఇప్పటికే పలు చోట ఇలాంటి అనుభవాల్ని సొంతం చేసుకున్న వైసీపీ నేతలకే కాదు.. పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే చేరారు. అధినేత ప్లాన్ చేసిన ప్రోగ్రాంకు వెళ్లకపోతే బాగుండదన్న ఉద్దేశంతో నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు వెళుతున్న ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.

తాజాగా ఆయన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పాత క్రిష్ణదేవి పేట పంచాయితీలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యల చిట్టాను విప్పారు.

ఆసక్తికరమైన విషక్ష్ం ఏమంటే.. ఎమ్మెల్యేలను ప్రశ్నించే విషయంలో మగాళ్లు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతే.. అందుకు భిన్నంగా మహిళలు మాత్రం.. ఇదేంది ఎమ్మెల్యేగారూ.. అంటూ నిలదీశారు.

ఎన్నికలప్పుడు తమ ఊరికి వచ్చారని.. మళ్లీ ఇప్పుడే వస్తున్నారన్న మహిళలు. మూడేళ్ల లో చేసిన డెవలప్ మెంట్ ఏమిటి? అంటూ ప్రశ్నించారు. ఊళ్లో గుడి లేదు.. బడి లేదు.. అంగన్ వాడీ కేంద్రంతో పాటు రోడ్లు కూడా లేవు. శ్మశానం లేదు. గత ఎన్నికల్లో మీకే ఓటేశాం. సంక్షేమ పథకాల అమల్లోనూ అన్యాయం జరుగుతోంది" అంటూ నిలదీశారు.

మహిళలు పెద్ద ఎత్తున సమస్యల్ని ప్రస్తావించిన వేళ.. కంగుతిన్న ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ వారిని అనునయించే ప్రయత్నం చేశారు. వారి సమస్యల్ని తాను తప్పక పరిష్కరిస్తామని మాట ఇవ్వటంతో మహిళలు శాంతించారు. చూస్తుంటే.. తాజా కార్యక్రమం వైసీపీ ప్రజా ప్రతినిధులకు కొత్త అనుభవాన్ని మిగిలుస్తుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News