మోడీ ప్రారంభించిన వారణాసి-కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రత్యేకతలేంటి?
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన కలల ప్రాజెక్టు శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ ను సోమవారం వారణాసిలో ప్రారంభించారు. వారణాసికి చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ మొదట కాల భైరవ ఆలయంలో హారతి ఇచ్చారు. తర్వాత కాశీ విశ్వనాత్ ఆలయానికి వెళ్లడానికి ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ఖిర్కియా ఘాట్ నుంచి లలితా ఘాట్ వరకూ డబుల్ డెకర్ బోటులో ప్రయాణించారు.
గంగా నదీ తీరాన ఘాట్ల దగ్గర ఉన్న జనాలకు చేతులు ఊపుతూ ముందుకు సాగారు. లలితా ఘాట్ చేరుకున్న తర్వాత ప్రధాని కాశీ విశ్వనాథుడికి పూజలు చేశారు. తర్వాత ఆయన కాశీ విశ్వనాథ్ ప్రాజెక్టును ప్రారంభించారు. యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఒక పెద్ద వేడుకలా నిర్వహించడానికి నగరాన్ని అందంగా అలరించారు.
1669లో అహిల్యాబాయి హోల్కర్ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆ తర్వాత దాదాపు 350 ఏళ్లకు ప్రధాని నరేంద్రమోదీ ఆలయ విస్తరణ, పునరుద్ధరణ కోసం 2019 మార్చి 8న విశ్వనాథ్ ఆలయ కారిడార్ కు శంకుస్థాపన చేశారు. రెండేళ్ల 8 నెలలకు ఇప్పుడు ఈ డ్రీమ్ ప్రాజెక్టులో 95 శాతం పనులు పూర్తయ్యాయి.
మొత్తం కారిడార్ నిర్మాణానికి రూ.340 కోట్లు వ్యయం చేశారని భావిస్తున్నారు. అయితే దీని మొత్తం వ్యయం గురించి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు.
కారిడార్ ను దాదాపు 50వేల చదరపు మీటర్ల ఒక పెద్ద ప్రాంగణంగా నిర్మించారు. దీని ప్రధాన ప్రవేశమార్గం గంగానదివైపు లలితా ఘాట్ నుంచి ఉంటుంది. విశ్వనాథ్ కారిడార్ ను మొత్తం 3 భాగాలుగా విభజించారు. మొదటిది ఆలయ ప్రధాన భాగం, దీనిని ఎర్ర రాతితో నిర్మించారు. ఈ కారిడార్ లో 24 భవనాలు కూడా నిర్మించారు.
కాశీ అంతటా పండుగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ భవనాలు చౌరస్తాలు రంగురంగుల విద్యుత్ లైట్లతో అలంకరించారు. ఈ కారిడాద్ లో డ్రీమ్ ప్రాజెక్టులో ఇప్పటికే 95శాతం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ కారిడార్ లో 2600 మంది కార్మికులు, 300 మంది ఇంజినీర్లు మూడు షిఫ్టుల్లో నిరంతరం పనిచేస్తున్నారు.