బ్రేకింగ్: సుప్రీంకోర్టులో ఏపీ పంచాయితీ ఎన్నికలపై అనూహ్య పరిణామం

Update: 2021-01-24 10:55 GMT
ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల లొల్లి సుప్రీంకోర్టులోనూ కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ అంశంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిపే బెంచ్ మారడం సంచలనమైంది.

తొలుత జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం జాబితాలో ఈ పిటీషన్ ఉండగా.. తాజాగా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రిషికేష్ రాయ్ బెంచ్ కు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మార్చడం చర్చనీయాంశమైంది.

ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఏపీలో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  ఉద్యోగ సంఘాలు సైతం వేరే పిటీషన్ దాఖలు చేశాయి. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం కేవియట్ దాఖలు చేసింది.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన వేర్వేరు పిటీషన్లపై ఇక నుంచి ధర్మాసనం మార్పుతో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం విచారించనుంది.

రేపు ఉదయం 11 గంటల తర్వాత ఈ పిటీషన్లు విచారణకు వచ్చే అవకాశాలున్నాయి.  రేపు సుప్రీంకోర్టు ఏం ఆదేశాలు ఇవ్వనుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
Tags:    

Similar News