ఆవు మూత్రం 13వేలు.. పేడ 11వేలు.. ఎక్కడో తెలిస్తే షాక్!
హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆవుకు గానీ ఆవు మూత్రానికి గానీ చాలా ప్రాధాన్యత ఉన్నది. ఇప్పటికీ గ్రామాలలో కొంతమంది ఆవు మూత్రంతో స్నానం చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి.;
హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆవుకు గానీ ఆవు మూత్రానికి గానీ చాలా ప్రాధాన్యత ఉన్నది. ఇప్పటికీ గ్రామాలలో కొంతమంది ఆవు మూత్రంతో స్నానం చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి కొంతమంది ఆవు మూత్రాన్ని పవిత్రంగా భావించి ఉదయాన్నే సేవిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయుర్వేదం ప్రకారం ఆవు మూత్రం అనేది చాలా మంచిదని.. అందుకే ఆయుర్వేద మూలికలలో ఈ మూత్రాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ఆవు మూత్రంతోనే కాదు ఆవుపేడతో కూడా కొన్ని దేశాలలో బిజినెస్ చేస్తూ భారీగా ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు. మరి కొంతమంది ఏకంగా ఆన్లైన్ ద్వారా భారీ ధరకే వీటిని అమ్మేస్తున్నారు. ఇక వీటి ఆన్లైన్ ధరలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోకమానరు. అయితే ఇది ఎక్కడో తెలిస్తే మాత్రం మరింత ఆశ్చర్యపోతారు.
అసలు విషయంలోకి వెళ్తే.. ఇప్పుడు న్యూజిలాండ్ ఆక్లాండ్ లో "నోవా ఫ్రెష్ " లో ఆవు మూత్రం, ఆవు పేడ స్టోర్లో అమ్ముతున్నారు. ఈ స్టోర్ లో వాటి ధర చూసి ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారు. నోవా ఫ్రెష్ స్టోర్ లో ఆవు మూత్రం రెండు లీటర్లు 253 డాలర్లు కాగా(మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 13 వేల రూపాయలు అన్నమాట), ఆవు పేడ కేజీ 250 డాలర్లు (అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 11 వేల రూపాయలు). అలాగే ఆవు పేడతో తయారు చేసినటువంటి బేబీ పౌడర్ ధర 214 నుంచి 250 డాలర్ల వరకు ఉన్నట్లుగా తెలియజేశారు. ముఖ్యంగా ఆవు పేడ, మూత్రంలో యాంటీ బయోటిక్స్ ఉంటాయని ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరం.
ఆయుర్వేద ప్రకారం గోమూత్రాన్ని క్యాన్సర్, కుష్టు వంటి వ్యాధులను నయం చేస్తోంది. గోమూత్రాన్ని సబ్బులు, షాంపూలు తయారు ఉత్పత్తులలో కూడా వీటిని ఉపయోగిస్తారు. గోమూత్రాన్ని ఉపయోగించి ఫ్లోర్ క్లీనింగ్ లోషన్లు అలాగే శానిటైజేషన్ వంటి ఉత్పత్తులను కూడా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే బాడీలోషన్స్ వంటి వాటిని కూడా తయారు చేయడంలో ఈ ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తున్నట్లు నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. గోమూత్రం కేవలం చర్మ సౌందర్యానికి మాత్రమే కాదు. నేలలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియాను కూడా మెరుగుపరిచేలా చేస్తుంది. దీనివల్ల నేల సారవంతంగా అవ్వడమే కాకుండా పంట దిగుబడిని కూడా పెంచేలా చేస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో తరచూ ఎక్కడ చూసినా కూడా సేంద్రియ వ్యవసాయ పద్ధతిని ఉపయోగిస్తున్నారు.