ఎవరెస్ట్ సాహసం.. ఇద్దరి ప్రాణాలు తీసింది..

Update: 2019-05-25 06:57 GMT
ప్రపంచంలోనే ఎత్తైన పర్వతమది.. పైగా అనుకూలమైన వాతావరణం మూడు నెలలే.. అందుకే ఈ ఎండాకాలంలోనే ఆ అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాలని అందరికీ ఉంటుంది. సాహసికులందరూ ప్రయత్నిస్తుంటారు. గమ్యం చేరేవాళ్లు కొందరు.. పట్టువదలి పడిపోయే వారు ఇంకొందరు..

ఎవరెస్ట్ పిచ్చి ఎక్కువైంది. ప్రపంచంలోనే ఎత్తైన పర్వత్వాన్ని అధిరోహించడానికి సాహసికులు పోటెత్తుతున్నారు. ఇదే అక్కడ ట్రాఫిక్ జాంకు కారణమవుతోంది. కేవలం వరుసలో కొంతమంది మాత్రమే ఎక్కడానికి వీలుంటుంది. కానీ వందలమంది వచ్చేసరికి అక్కడ ట్రాఫిక్ జాం అవుతోంది.

తాజాగా వివిధ దేశాలకు చెందిన 200 మంది పర్వతారోహకులు ఆసక్తి చూపారు  ఎవరెస్ట్ ఎక్కడానికి మార్చి నుంచి జూన్ వరకు మాత్రమే అనుకూలం. తర్వాత మంచుతో కప్పబడి వాతావరణం అనుకూలించదు. దీంతో నేపాల్ ప్రభుత్వం తాజాగా 381మందికి అధిరోహించడానికి అనుమతి ఇచ్చింది. ఒకేసారి వందలమంది పర్వతంపైకి చేరుకున్నారు. శిఖరం చేరుకునే మార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యి నిలిచిపోయారు. వెనక్కి వెళ్లలేక, కిందకు రాలేక అక్కడే గంటల పాటు ఉండిపోయారు.

అయితే తిరిగి వచ్చేక్రమంలో ఇద్దరు భారతీయులు చనిపోయారు. ఒక్కసారిగా ఎవరెస్ట్ పై మంచుతో కూడిన గాలులు ఉదృతంగా వచ్చాయి. దీని ధాటికి కల్పనా దాస్ (57) అనే మహిళ, నిహాల్ భగవాన్ (27) అనే వ్యక్తి చనిపోయారు. ట్రాఫిక్ జామ్ వల్ల దాదాపు 12 గంటల పాటు వారంతా ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయి చికిత్స అందక మృత్యువాత పడ్డారు. .

    

Tags:    

Similar News