ఇద్దరు మంత్రులు అరెస్ట్.. బెంగాల్ లో టెన్షన్.. మమత ఆగ్రహం..!
పశ్చిమబెంగాల్ లో మరోసారి టెన్షన్ వాతావరణం అలుముకున్నది. ఇప్పటికే పశ్చిమబెంగాల్ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న పరిస్థితి ఉందన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ బెంగాల్ లో మళ్లీ మమత గెలుపొందారు. ఇదిలా ఉంటే మమత గెలిచిన వెంబడే.. అక్కడ బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.
తాజాగా మరోసారి బెంగాల్ లో రాజకీయవేడి రాజుకున్నది. మమతా బెనర్జీ హయాంలోని ఇద్దరు మంత్రులను సీబీఐ అరెస్ట్ చేసింది. నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
సోమవారం ఉదయం పశ్చిమబెంగాల్ కు చెందిన మంత్రులు ఫిర్మాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో బెంగాల్లో టెన్షన్ వాతావరణం అలుముకున్నది. కేంద్ర ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని తృణమూల్ నేతలు ఆరోపిస్తున్నారు.
మరోవైపు కోల్‌కతా లోని సీబీఐ కార్యాలయానికి మమతా బెనర్జీ వెళ్లారు. తనను కూడా అరెస్ట్ చేయాలంటూ ఆమె సవాల్ విసిరారు. సీబీఐ నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేస్తోందని.. ఓ మంత్రిని అరెస్ట్ చేయాలంటే ముందుగా నోటీసులు ఇవ్వాలని కానీ సీబీఐ అటువంటి రూల్స్ ఏవీ పాటించలేదని ఆమె ఆరోపించారు.
మరోవైపు…తృణమూల్ ఎమ్మెల్యే మదన్ మిత్రా, ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మేయర్ సోవన్ ఛటర్జీ నివాసాలకు కూడా కేంద్ర బలగాలు చేరుకున్నాయి. వీరిని కూడా అరెస్ట్ చేసి సీబీఐ కార్యాలయానికి తరలించారు.
ఏమిటీ నారదా స్టింగ్ ఆపరేషన్?
2016 ఎన్నికల సమయంలో ‘నారద న్యూస్’ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన నలుగురు ఎంపీలు, నలుగురు మంత్రులు ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకున్నట్టు అప్పట్లో వీడియోలు బయటకు వచ్చాయి. ఈ ఘటనపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో విచారణ చేయాలని ఇటీవలే బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ ఆదేశాలు ఇచ్చారు. తాజాగా ఈ కేసులో అరెస్ట్ లు కొనసాగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు..!
తృణమూల్ మంత్రుల అరెస్ట్‌తో పశ్చిమబెంగాల్ లో నిరసనలు కొనసాగుతున్నాయి. టీఎంసీ కార్యకర్తలు, నేతలు నిరసనలు చేపడుతున్నారు. దాంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. అయితే ఈ విషయంపై సీబీఐ అధికారులు మాట్లాడుతూ.. గవర్నర్ సూచనల మేరకు తాము అరెస్ట్‌లు సాగించినట్టు సీబీఐ అధికారులు చెప్పుకొచ్చారు. కక్షసాధింపు ఏమీ లేదని స్పష్టం చేశారు.