మోడీ దెబ్బ.. తిరుమల వెంకన్న అప్ గ్రేడ్

Update: 2016-12-02 13:57 GMT
500.. 1000 నోట్లను రద్దు చేయాలన్న మోడీ సర్కారు నిర్ణయంత దేశవ్యాప్తగా నాలుగు వారాలుగా అన్ని వ్యాపారాలు స్తంభించిపోయాయి. నోట్లతో లావాదేవీలు జరిగే ప్రతి చోటా ఇబ్బంది తప్పలేదు. ఈ నేపథ్యంలో మున్ముందు ఈ ఇబ్బంది తలెత్తకుండా అప్ గ్రేడ్ కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సంస్థతో ఇందుకోసం డీల్ చేసుకుంది టీటీడీ. ఆలయానికి అవసరమైన టెక్నికల్ సపోర్ట్ ఆ సంస్థ అందించనుంది. ఆలయానికి విచ్చేసే భక్తులకు అవసరమైన అన్నిరకాల ఈ-సేవలను టీసీఎస్ ద్వారా టీటీడీ అందించనుంది. ఈ-డొనేషన్లు - ఈ-హుండీ - ఈ-పబ్లికేషన్స్ - ఈ-చలాన్ - ఈ-దర్శన్ - ఈ-వసతి - ఈ-సేవ వంటి సేవలను యాత్రికులకు టీసీఎస్ సాయంతో అందించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

ఈ సాంకేతిక సేవల ద్వారా దేవస్థాన పాలనలో పారదర్శకత పెరగడంతో పాటు రోజువారీ కార్యకలాపాలు మరింత సులభతరం కూడా అవుతాయని భావిస్తున్నారు. యాత్రికులకు మెరుగైన సేవలందించడానికి కొత్త ఆన్ లైన్ వెబ్ పోర్టల్ ద్వారా స్వామి సేవ.. దర్శన్.. డోనర్ మేనేజ్ మెంట్ సిస్టమ్.. టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాంటి సేవల్ని అభివృద్ధి చేయనున్నట్లు టీసీఎస్ సంస్థ ప్రకటించింది. మరోవైపు జనాలు తమ దగ్గరున్న పాత పెద్ద నోట్లను ఏం చేసుకోవాలో తెలియక ఆలయాలకు భారీగా కానుకలు ఇచ్చేస్తున్నారు. రోజుకు సగటున రూ.3 కోట్లుగా ఉండే తిరుమల హుండీ ఆదాయం రూ.4 కోట్లు దాటడం విశేషం. ఈ నేపథ్యంలో హుండీలో సమర్పించే డొనేషన్లకు సంబంధించి పారదర్శకత కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే దేవాలయాలన్నీ నగదు రహిత సేవలను అందించాలని అధికారులు పేర్కొంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News