జీతమో రామచంద్ర.. మొత్తుకుంటున్న ఆర్టీసీ కార్మికులు!

Update: 2021-02-14 05:45 GMT
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందా..? సంస్థకు వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఆర్థిక శాఖపై ఆధారాపడాల్సి వస్తుందా..?  ఈ సంస్థలోని సిబ్బందికి ఈనెలలో ఇంకా జీతాలు అందలేదు. నెలగడిచి రెండువారాలు గడుస్తున్నా సగటు కార్మికునికి వేతనం రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గత నెలలోనూ 12 తేదీన వేతనం అందింది.. అయితే ఆర్టీసీలో వేతనాలు ఇచ్చేందుకు ఆలస్యం ఎందుకు అవుతుంది..? సంస్థకు వస్తున్న ఆదాయం ఎంత..? ఈ గందరగోళానికి కారణం ఏంటీ..?

గతంతో పోలిస్తే ఆర్టీసీలో కొంత ఆదాయం మెరుగుపడుతోంది. రోజూ వచ్చే ఆదాయంలో రోజూ వచ్చే ఆదాయంలో ఖర్చులు పోనూ 20 కోట్లు మాత్రే జీతాల కోసం సర్దుబాటు చేశారు. వాస్తవానికి ఆర్టీసీ సంస్థలోని సిబ్బంది వేతనాలకు 100 కోట్లకు పైగానే అవసరం. ఈ మొత్తంలో కొంత ఆర్థిక శాఖ నుంచి తీసుకోవాల్సి ఉంది. కానీ ఈసారి ఆ నిధులు అందలేదని తెలుస్తోంది. అయితే గత11 రోజుల నుంచి ఆర్టీసీకి రూ.118 కోట్ల ఆదాయం వచ్చిందని.. అయినా వేతనాలు అందించడం లేదని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

అయితే గతంలో ప్రైవేటీకరణపై ఆందోళన చేసిన కార్మిక సంఘాలు మరోసాది ఉద్యమం చేయనున్నాయా..? అనే వార్తలు వస్తున్నాయి. అయితే వేతన సవరణ విషయంలో అనుుమానాలున్నాయి ఆరోపిస్తున్నయి ఇటీవలే టీఎంయూ, ఈ యూ సమావేశాలు పెట్టి విమర్శలు గుప్పించాయి. తాజాగా తీనిపై చర్చించేందుకు ఈనెల 20 రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని టీఎస్ ఆర్టీసీ స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శలు రాంచందర్, వీఎస్ రావు తెలిపారు.

గత నెలలో ఇలాగే డబ్బు కొరత ఉండడంతో ఉన్నంత మేరకు ఉద్యోగుల జీతాలు చెల్లించి, మిగతా వారికి ప్రభుత్వం నుంచి డబ్బు వచ్చాక అందించారు. కానీ ఈసారి ప్రభుత్వం నుంచి డబ్బు రానందున సగం కాకుండా ఒకేసారి చెల్లించాలని అనుకుంటున్నారు. సోమవారం వరకు జీతాలు సర్దేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే వేతనాలు విషయంలో ఆర్టీసీ ప్రవర్తనపై సిబ్బంది ఆందోళన చేస్తోంది. 
Tags:    

Similar News