ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ .. నిజామా? అబద్దమా?

Update: 2020-10-24 07:30 GMT
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా గడుపుతున్నారు. నవంబర్ 3న అద్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. దీనితో ఎలాగైనా మరోసారి అమెరికా అధ్యక్ష పీఠం పై కూర్చోవాలనే ఆశయంతో ప్రతిక్షణం వూహ్యా రచన చేస్తూ , ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే , ప్రత్యర్థి జో బిడెన్ కూడా ప్రచారం లో దూసుకుపోతుండటంతో , బిడెన్ కి అడ్డుకట్ట వేస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు ట్రంప్. ఇదిలా కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కి గురైంది అంటూ ఓ వార్త తెగ వైరల్ అయింది.  
అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు వచ్చిన మీడియా కథనాలను వైట్‌ హౌస్, ట్విట్టర్ వేరు వేరు ప్రకటనల్లో కొట్టిపేసింది.  ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ను ఎవరూ హ్యాక్ చేయలేదని ప్రకటించాయి. అయితే, డచ్ సైబర్ సెక్యూరిటీ రీసర్చర్ విక్టర్ గేవర్స్ అమెరికా అధ్యక్షుడి ట్విట్టర్ అకౌంట్‌ ను హ్యాక్ చేసినట్లు ప్రకటించారు. ఐదో ప్రయత్నంలో ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ ‌లోకి లాగిన్ అయినట్లు చెప్పారు. అయితే అకౌంట్ హ్యాక్ అయిన అతి తక్కువ సమయంలోనే  వైట్‌ హౌస్ అధికారులు ట్రంప్ అకౌంట్  పాస్‌ వర్డ్‌ ను మార్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో మీడియా ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కి గురైంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈ వార్తలపై  వైట్ ‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు వచ్చిన వార్తలను అయన  ఖండించారు. 
Tags:    

Similar News