మహిళా మంత్రులు...ఎమ్మెల్యేలు చలో ఢిల్లీ !

ఏపీలో టీడీపీ కూటమికి చెందిన మహిళా మంత్రులు మహిళా ఎమ్మెల్యేలు అంతా కూడా చలో ఢిల్లీ అంటున్నారు.;

Update: 2026-04-15 19:03 GMT

ఏపీలో టీడీపీ కూటమికి చెందిన మహిళా మంత్రులు మహిళా ఎమ్మెల్యేలు అంతా కూడా చలో ఢిల్లీ అంటున్నారు. అంతా కలసి ఏకంగా మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం పెడుతున్నారు. వీరంతా కలిసి ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను స్వయంగా తిలకిస్తారు ఈసారి పార్లమెంట్ లో మహిళా బిల్లు మీద చర్చ రిజర్వేషన్ల అమలు మీద పార్లమెంట్ తీసుకోబోయే నిర్ణయాన్ని స్వయంగా గ్యాలరీల నుంచి వీక్షిస్తారు.

చారిత్రక ఘట్టం :

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మహిళలకు చట్ట సభలలో రిజర్వేషన్లు కల్పించడం అన్నది ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా భావిస్తున్నారు. గతంలో ఎపుడూ జరగలేదు ఇంతకాలం అయినా మహిళలకు న్యాయం చేకూరలేదు దాంతో ఇపుడు ఆ అపూర్వమైన సందర్భం వచ్చింది. దశాబ్దాల నాటి కల నిజం కాబోతోంది. దాంతో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షించడం కోసం మద్దతు తెలియచేయడం కోసం కూటమి తరఫున నెగ్గిన మహిళా ఎమ్మెల్యేలు అంతా ఢిల్లీకి వెళ్తున్నారు

రాజకీయాల్లో మహిళా సాధికారత :

కూటమి మంత్రులు సవిత, వంగలపూడి అనిత, గుమ్మడ్ సంధ్యారాణి సహా పలువురు మహిళా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిదగిన విషయం మహిళా బిల్లు ఆమోదమని కూటమి మహిళా ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు మహిళలకు చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పించడం ద్వారా భారత ప్రజాస్వామ్యం మరింత ధృడంగా మారుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని నరేంద్రమోడి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఎంతో హర్షనీయమని అన్నారు మహిళల అభివృద్దితోనే సమాజాభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. మహిళా బిల్లుతో రాజకీయాల్లో మహిళల పాత్ర పెరిగి సాధికారతకు బలమైన పునాది పడుతుందని కూటమి మహిళా మంత్రులు పేర్కొన్నారు.

ప్రధానికి ధన్యవాదాలు :

ఈ మూడు రోజుల సమావేశాలు ముగిసిన తర్వాత అనంతరం ఈ నెల 18న ప్రధానమంత్రి నరేంద్ర మోడిని ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూటమి మహిళా ప్రజా ప్రతినిధులు అంతా కలిసి ధన్యవాదాలు తెలియజేయనున్నారు. మొత్తం మీద చూస్తే ఒక పండుగ వాతావరణంలో మహిళా బిల్లు ఆమోదం సందర్భాన్ని జరుపుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే మహిళా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా ఢిల్లీకి పయనం అవుతున్నారు.

Tags:    

Similar News