అధ్యక్ష ఎన్నికల ఫలితాలు కాకపోయినా ఆశ్చర్యం లేదు : ట్రంప్ !

Update: 2020-08-22 14:30 GMT
అగ్రరాజ్యం అమెరికా అధినేత .. డోనాల్డ్ ట్రంప్ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారుతుంటారు. ప్రతి రోజూ కూడా ఎదో ఒక వివాదాస్పదమైన కామెంట్ చేయనిదే ట్రంప్ కి నిద్ర పట్టదు. ఆయనకి అది పటిపాటే. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ మరో సంచలనమైన కామెంట్ చేశారు. ఈ ఏడాది నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని ట్రంప్ చూసినప్పటికీ అమెరికా నిబంధనల ప్రకారం ..ఎన్నికల వాయిదా కుదరని పని. దీనితో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3 న జరగబోతున్నాయి.

ఈ నేపథ్యంలో.. ఎన్నికలు జరిగిన తర్వాత, ఫలితాల వెల్లడికి వారాలు, నెలల సమయం కూడా పట్టవచ్ఛునని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్ చేసాడు. పోస్టాఫీసులు, లోకల్ ఎలెక్షన్ సంస్థల్లో మెయిల్-ఇన్-బ్యాలెట్లు కుప్పలు, తెప్పలుగా పేరుకుపోవచ్ఛునని  ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు. దీనివల్ల ఫలితాలు చాలా జాప్యం కావచ్ఛు అన్నారు. ఎలక్షన్ కౌంట్ అన్నదే ఇప్పట్లో ఉండదని, ఇది ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని, నా అభిప్రాయం ప్రకారం బహుశా ఫలితాల ప్రకటనకు వారాలు, నెలలు పట్టవచ్చు..  అసలు ఫలితం వెల్లడి కాకపోయినా ఆశ్చర్యం లేదు అని ట్రంప్ అన్నారు.

కౌన్సిల్ ఆఫ్ నేషనల్ పాలసీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. 50 మిలియన్ల ఓటర్ల మెయిల్-ఇన్-ఓట్ల లెక్కింపు చాలా ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయన్నారు. అందులోనూ ఈ కరోనా క్రైసిస్ కూడా ఇందుకు దోహదం చేస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో తన డెమొక్రాట్ ప్రత్యర్థి జో బిడెన్ కన్నా చాలా వెనుకబడి ఉన్న ట్రంప్..ఈ నేపథ్యంలో ఫలితాలను తారుమారు చేసేందుకు డెమొక్రాట్లు దేశవ్యాప్తంగా మెయిల్-ఇన్-ఓటింగ్ ని మానిప్యులేట్ చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇది మన ప్రజాస్వామ్యానికి పెద్ద సమస్య అవుతుందన్నారు. చూడాలి మరి ట్రంప్ వ్యాఖ్యలపై ప్రత్యర్థులు ఏ విధంగా స్పందిస్తారో ..
Tags:    

Similar News