అమెరికా పరువు కోసం ట్రంప్ ను పీకేస్తున్నారు..

Update: 2021-01-11 13:02 GMT
అమెరికా పార్లమెంట్ పైనే దాడి చేసి ప్రపంచవ్యాప్తంగా అమెరికా పరువు తీసిన ట్రంప్ కు గట్టి షాక్ ఇచ్చేందుకు అక్కడి ప్రతిపక్షం డెమొక్రాట్లు రెడీ అయ్యారు. మరో పదిరోజుల్లో దిగిపోతున్న ట్రంప్ ఆలోపే ఇంటికి పంపి ఘోరమైన అవమానాన్ని ఇచ్చేందుకు ప్రతిపక్షాలు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్ పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. కొత్తగా అధ్యక్షుడు బాధ్యతలు తీసుకోవడానికి మునుపే ట్రంప్ ను దించేస్తారనే వార్తలు వస్తున్నాయి. అమెరికా పరువును ట్రంప్ ను దించేసి నిలుపుకోవాలని  భావిస్తున్నారు.

కొత్తగా అధ్యక్షుడు బాధ్యత‌లు తీసుకోవ‌డానికి మునుపే ట్రంప్ ను దించేస్తార‌నే వార్తలు వ‌స్తున్నాయి. రెండు స‌భ‌ల్లోనూ ట్రంప్ అభిశంస‌న తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఒక స‌భ‌లో డెమొక్రాట్లు మెజారిటీతో ఉండ‌టంతో అక్కడ ట్రంప్ ను తొల‌గించే తీర్మానం ఆమోదం పొంద‌డం లాంఛ‌న‌మే. రిప‌బ్లిక‌న్ లు మెజారిటీతో ఉన్న స‌భ‌లో ట్రంప్ అభిశంస‌న తీర్మానం ఆమోదం పొందితే అది సంచ‌ల‌న‌మే అవుతుంది.

ప‌ది రోజుల ముందో, వారం ముందో.. అయినా ట్రంప్‌ను తొల‌గిస్తే అది అమెరిక‌న్ చ‌రిత్రలోనే ప్రత్యేక అధ్యాయం అవుతుంది. ఆయ‌న‌పై సొంత పార్టీ కూడా గుర్రుగా ఉంద‌ని అంటున్నారు. రిప‌బ్లిక‌న్ పార్టీలో ఇప్పటికీ ట్రంప్ కు మ‌ద్దతుదారులు ఉన్నప్పటికీ.. ట్రంప్ అభిశంస‌న ప్రక్రియ‌లో ఆ పార్టీ కూడా భాగ‌స్వామి అవుతుంద‌నే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ట్రంప్ ను కనుక తొలగిస్తే అది అమెరికన్ చరిత్రలోనే ప్రత్యేక అధ్యాయం అవుతుంది. ఈ అభిశంసనతో అమెరికా తృతీయ ప్రపంచ దేశాల స్థాయికి పడిపోయిన పరువును కాపాడుతుంది.
Tags:    

Similar News