• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  టీఆర్ ఎస్ త‌ర్వాతి...

టీఆర్ ఎస్ త‌ర్వాతి టార్గెట్ భారీగా ఉందిగా?

By - Tupaki Desk
Update: 2016-04-18 04:15 GMT
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికకు అధికార టీఆర్ ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. అక్కడ పోటీ చేస్తామని సీపీఎం ప్ర‌క‌టించ‌డంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇప్పుడు గులాబీ పార్టీ నుంచి నిలబడే అభ్యర్థి ఎవరన్నది ఉత్కంఠగా మారింది. కచ్చితంగా గెలిచే సీటు కావడంతో పోటీ ఎక్కువైంది. మరి అధిష్టానం ఏం చేయబోతోంది..? ఈ టార్గెట్‌ను ఎలా సాధించ‌నుంది అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకట్ రెడ్డి అకాల మరణంతో అక్కడ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయింది. అయితే ఈ స్థానానికి పోటీ పెట్టకుండా..ఏకగ్రీవం చేయించాలి, మళ్లీ తమ సీటును తామే పొందాలనే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇదే సమయంలో గులాబీ పార్టీ కూడా కాంగ్రెస్ నుంచి, వెంకట్ రెడ్డి కుటుంబం నుంచి గులాబీ పార్టీలోకి వచ్చి పోటీ చేస్తే ఏకగ్రీవం అనుకుంటోంది. అయితే ఈలోపు ఖమ్మం తమ కంచుకోటగా భావిస్తున్న సీపీఎం పాలేరులో పోటీ చేస్తామని ప్రకటించింది. దీంతో ఏకగ్రీవం కాస్తా ఎన్నికగా మారనుంది. ఎన్నిక తప్పనిసరి కావడంతో ఇప్పుడు అభ్యర్థులపై ఆసక్తి ఏర్పడింది.

టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఎన్నికల్లో తిరుగులేని విజయాల పరంపర కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో వస్తున్న ఈ ఎమ్మెల్యే ఉప ఎన్నిక గులాబీ నేతలకు అందివచ్చిన అవకాశంగా కనిపిస్తోంది. ఇటీవల ఖమ్మంలో రెండు సాగునీటి ప్రాజెక్టులను ప్రకటించడమే కాకుండా వచ్చే ఏడాది నాటికి వాటిని పూర్తి చేస్తామని అధికార పార్టీ ప్రకటించడంతో ఖమ్మంలో గులాబీ పార్టీకి బలం పెరుగుతుందని భావిస్తున్నారు. అంతే కాకుండా ఇటీవల జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా టీఆర్ ఎస్ పార్టీ విజయం సాధించడంతో ఇక తిరుగులేదనుకుంటున్నారు. దీంతో అభ్యర్థి ఎవరైనా గెలుపు తమదేనన్న ధీమాలో గులాబీ పార్టీ ఉండడంతో...అభ్యర్థులు కూడా అదే స్థాయిలో పోటీలు పడుతున్నారు. గెలిచే టికెట్ కోసం అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు.

పాలేరు సీటు తనకు కేటాయించాలని వైసీపీ నుంచి టీఆర్ ఎస్‌ లో చేరిన గట్టు రామచంద్రరావు అడుగుతున్నారు. తన కోరికను బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఖమ్మం నేతగా, వైసీపి నుంచి వచ్చిన తనకు అక్కడ కొంత పట్టు ఉందని తనకు టికెట్ ఇస్తేమంచి మెజారిటీ సాధిస్తానంటున్నారు. సాధారణ ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆ పార్టీ నేత బేగ్ తనకు మరోసారి అవకాశం కల్పించాలంటున్నారు. పార్టీకోసం మొదటి నుంచి కష్టపడిన తనకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అవుతానంటున్నారు. ఇందుకోసం పార్టీలో ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.
Tags:    
  • TRS Party 
  • Paleru By Elections 
  • Telugu NEws 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS