కరోనాకు జీవించే హక్కు ఉంది: మాజీ సీఎం
పుర్రెకో బుద్ది అన్నట్టు కరోనా పేరిట ఇప్పుడు రాజకీయం రంజుగా సాగుతోంది. మనుషుల ప్రాణాలు తీస్తున్న కరోనాపై కూడా జాలి చూపించాడు మాజీ ముఖ్యమంత్రి. ఏం దానికి జీవించే హక్కులేదా? అని ప్రశ్నించాడు. అది జీవించి మనల్ని చంపుతోందికదా అది తప్పు కాదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మాజీ సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమయ్యాయి.
కరోనావైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడు భారతదేశంలో ఉధృతంగా ఉంది. ప్రతిరోజూ మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రాజకీయ నాయకులు ఒకరినొకరు నిందించుకోవడానికే టైం పోతోంది. మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడండి అంటూ వెర్రి ప్రకటనలు చేయడంలో నేతలు బిజీగా ఉన్నారు. ప్రతిరోజూ, ఒక రాజకీయ నాయకుడు కరోనా మహమ్మారిపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సైతం చేరారు.
‘కరోనా కూడా ఒక జీవి అని, మానవుల మాదిరిగానే జీవించే హక్కు’ దానికి కూడా ఉందని రావత్ వివాదాస్పద ప్రకటనలు చేశాడు. వైరస్ ఇప్పుడు దాని రూపాన్ని మారుస్తూ మనపై దాడి చేస్తోందని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్‌లోని స్థానిక వార్తాపత్రికతో మాట్లాడుతూ రావత్ ఈ ప్రకటనలు చేశారు. ఇది పెద్ద దుమారం రేపింది.
మహమ్మారిపై ఇలాంటి సున్నితమైన వ్యాఖ్యలు చేసినందుకు ఇతర రాజకీయ నాయకులు.. నెటిజన్లు రావత్ ని తిట్టిపోశారు. మాజీ సీఎం ప్రకటనలను చూసి ‘మూర్ఖులు’ అని కామెంట్ చేశారు. రావత్ ఇలాంటి విచిత్రమైన వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు ఆవు మాత్రమే ఆక్సిజన్‌ను పీల్చుకుని పీల్చే జంతువు అని నోరు జారారు. ఈ ఏడాది ఆరంభంలో రావత్‌ను బిజెపి అకస్మాత్తుగా తొలగించింది. అయినా కూడా ఈ మాజీ సీఎం ఇంకా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.