నీట ఊటకోసం కొండను పిండిచేశారు.. గిరిజన మహిళల ఘనత

Update: 2020-09-28 04:15 GMT
నిజంగా ఉక్కు సంకల్పం అంటే వాళ్లదే. తమ గ్రామానికి నీళ్లు తెచ్చుకొనేందుకు ఏకంగా 250 మంది మహిళలు 18 నెలలు శ్రమించి ఓ కొండను తవ్వారు. వారి ఊరికి సమీపంలో ఓ నీటి కాలువ ఉంది. కానీ ఆ కాలువ వాళ్ల గ్రామంలోకి రాకుండా కొండ అడ్డుగా ఉంది. దీంతో మహిళలు కష్టపడి ఆ కొండను తవ్వారు. చివరకు ఆ కాలువను చెరువులొకి అనుసంధానించి తమ నీటికష్టాలను తీర్చుకున్నారు. ప్రభుత్వాలు యంత్రాల సాయంతో చేయాల్సిన పనిని గిరిజన మహిళలు చేయడం పట్ల సర్వతా హర్షం వ్యక్తమవుతోంది.  మధ్యప్రదేశ్‌లోని ఛాతర్‌పూర్ జిల్లా అంగ్రోతా గ్రామంలోని గిరిజన మహిళలు ఈ ఘనత సాధించారు.
‘అంగ్రోత గ్రామ పొలిమేర నుంచి ఓ వాగు పారుతోంది. అయితే ఆ వాగు గ్రామంలోకి రాకుండా ఓ కొండ అడ్డుగా ఉంది. ఈ కొండను తవ్వి గ్రామంలోని చెరువుకు నీళ్లు మళ్లిస్తే .. మూగజీవాల దప్పిక తీరుతుందని.. మేం పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నాం. కానీ ఎవరూ పట్టించుకోలేదు. చివరకు మేమే పునుకొని కొండను తవ్వాం ప్రస్తుతం ఈ చెరువులోకి నీరు పారుతోంది’ అంటూ ఆ గ్రామ మహిళలు మీడియాకు చెప్పారు.  

ఒక్కటై సాధించారు..
కానీ ఈ కొండను తవ్వడం అంత తేలికైన పని కాదని వాళ్లకు తెలుసు. ఈ విషయంపై ఆ గ్రామ మహిళలంతో ఎన్నోసార్లు సమావేశమయ్యారు. చివరకు ఎలాగైన ఆ కొండను తవ్వాలనే నిర్ణయించుకున్నారు. దాదాపు 18 నెలలపాటు 250 మంది మహిళలు బండలను పెద్ద పెద్ద సుత్తెలతో బద్దలు కొట్టారు. ప్రభుత్వాలు పూనుకొంటే ఈ పని కొన్నిరోజుల్లోనే పూర్తయ్యేది. కానీ మనపాలకులు ఇటువంటి పనులను పట్టించుకోరు. కనుక మహిళలే నడుం బిగించారు. ఏది ఏమైనా ఈ గిరిజన బిడ్డలకు అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి.
Tags:    

Similar News