ఇరాన్ లో భారత పౌరులకు రెడ్ అలెర్ట్
ఇదిలా ఉండగా ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇంకా ఇరాన్‌లో ఉన్న భారత ప్రజల్లు రాబోయే 48 గంటల పాటు తాము ఉన్న చోటే పూర్తి జాగ్రత్తలు తీసుకుని ఉండాలని సూచించింది.;
ఇరాన్‌లో వేగంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు తాము ఉన్న చోటే ఉండాలని సురక్షిత ప్రాంతాల్లో తల దాచుకోవాలని, ఇకపై ఎక్కడికీ కదలవద్దని భారత విదేశాల మంత్రిత్వ శాఖ సూచించింది. ఇరాన్ లోపల గానీ ఇరాన్ సరిహద్దుల వద్దకు గానీ ఎలాంటి కదలికలైనా టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయంతో సన్నిహిత సమన్వయంతో వారి స్పష్టమైన మార్గదర్శకత్వం పొందిన తర్వాత మాత్రమే పరిగణించాలని మంత్రిత్వ శాఖ లేటెస్ట్ గా విడుదల చేసిన మార్గదర్శ్కాలలో పేర్కొంది.
కీలక సమయం :
ఇదిలా ఉండగా ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇంకా ఇరాన్‌లో ఉన్న భారత ప్రజల్లు రాబోయే 48 గంటల పాటు తాము ఉన్న చోటే పూర్తి జాగ్రత్తలు తీసుకుని ఉండాలని సూచించింది. భారత ప్రజలు అన్ని విద్యుత్ సైనిక స్థావరాలకు దూరం పాటించాలని, అలాగే బహుళ అంతస్తుల భవనాలకు, ఉన్నతమైన అంతస్తులకు దూరంగా ఉండాలని కోరింది. ఎవరికి వారు తమ ఇళ్లలోనే ఉండాలని పేర్కొంది. ఇరాన్ రహదారులపై తిరిగే ప్రయత్నం చేయవద్దు అని స్పష్టం చేసింది. ఒకవేళ వెళ్లాల్సి వస్తే కనుక అక్కడి భారత రాయబార కార్యాలయం తో కచ్చితంగా సమన్వయం చేసుకోవాలని కోరింది. ఇరాన్ లో అద్దెకు తీసుకున్న హోటళ్లలో ఉన్న భారతీయ ప్రజలు రు అక్కడి భారతీయ రాయబార కార్యాలయ బృందాలతో నిరంతరం సంప్రదించాలని పేర్కొంది. ఇరాన్ లోని భారత పౌరులు అధికారిక తాజా సమాచారాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని పరిస్థితులను నిశితంగా గమనించాలని కోరింది.
ట్రంప్ హెచ్చరికల నేపథ్యం :
మరో వైపు చూస్తే ఒకవేళ టెహ్రాన్ ఒప్పందానికి రాకపోయినా కీలకమైన ప్రపంచ ఇంధన మార్గమైన హోర్ముజ్ జలసంధిని గడువులోగా తిరిగి తెరవకపోయినా అమెరికా ఒక్క రాత్రిలోనే ఇరాన్‌ను నాశనం చేయగలదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. గల్ఫ్ ద్వారా ఇంధన స్వేచ్ఛా ప్రవాహాన్ని అడ్డుకునే హక్కు ఇరాన్ కి లేదని ఆయన అంటున్నారు. ఈ క్రమంలో ఇరాన్ అమెరికాతో ఆమోదయోగ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం అయిదున్నర గంటల వరకూ గడువు విధించారు. వైట్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ కనుక హార్మూజ్ జలసంధి మూసివేస్తూ పోతే కనుక అమెరికా ఇరాన్ ఇంధన రవాణా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటుందని హెచ్చరించారు. ఇరాన్ వ్యవస్థలను వేగంగా ధ్వంసం చేస్తామని స్పష్టం చేశారు దీంతో ఇదిపుడు అతి పెద్ద చర్చగా అంతర్జాతీయంగా మారుతోంది.