జగన్ కుటుంబంలో తీవ్ర విషాదం
వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. జగన్ పెద్దనాన్న అంటే వైఎస్సార్ సోదరుడు వైఎస్ ఆనంద్ రెడ్డి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. జగన్ పెద్దనాన్న అంటే వైఎస్సార్ సోదరుడు వైఎస్ ఆనంద్ రెడ్డి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈయన వైఎస్ జగన్ మరో పెదనాన్న వైఎస్ భాస్కర రెడ్డికి సోదరుడు. ఇక. వైఎస్ ఆనంద్ రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో వైఎస్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కడప ఎంపీకి సైతం :
వైఎస్ భాస్కర్ రెడ్డి అంటే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తండ్రి. ఆయనకు సోదరుడే ఈ ఆనంద్ రెడ్డి. వైఎస్ భాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోనే ప్రసిద్ధ వైఎస్ కుటుంబానికి చెందినవారు. ఈయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి చిన్నాన్న కొడుకు అవుతారు. అంటే ఆనంద్ రెడ్డి కూడా అదే వరస అవుతారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల తదితరులకు ఈయన పెద్దనాన్న వరుస అవుతారు. ఇక చూస్తే పులివెందుల రాజకీయాల్లో భాస్కర రెడ్డి కుటుంబం కీలకంగా ఉంది. వైఎస్ ఆనంద్ రెడ్డి అయితే రాజకీయంగా పెద్దగా ప్రముఖంగా లేరని చెబుతున్నారు. వైఎస్ కుటుంబానికి చెందినవారైనప్పటికీ రాజకీయం వైపు చూడలేదు.
జగన్ పులివెందులకు :
ఈ క్రమంలో వైఎస్ జగన్ పులివెందులకు శుక్రవారం బయలుదేరి అక్కడకి చేరుకుంటారు అని అంటున్నారు. ఆనంద్ రెడ్డి అంత్య క్రియలలో ఆయన పాల్గొంటారని వైసీపీ వర్గాలు తెలిపాయి. మొత్తం మీద చూస్తే వైఎస్సార్ కుటుంబంలో ఇది విషాదంగా చూస్తున్నారు. జగన్ ఈ నెల మొదట్లోనే పులివెందుల వెళ్ళి వచ్చారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన మూడు రోజుల పాటు అక్కడ గడిపారు. తండ్రికి నివాళి అర్పించడమే కాకుండా ప్రజా దర్బార్ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఇపుడు అనూహ్యంగా ఇదే నెల చివరిలో మరోసారి ఆయన పులివెందుల వెళ్తున్నారు.