అప్పటివరకూ నేనే సీఎం....రేవంత్ ధీమా వేరే లెవెల్ !
తెలంగాణా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తానే 2034 వరకూ ముఖ్యమంత్రిగా ఉంటాను అని గట్టిగా చెప్పారు.
తెలంగాణా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తానే 2034 వరకూ ముఖ్యమంత్రిగా ఉంటాను అని గట్టిగా చెప్పారు. ఇపుడు 2026 నడుస్తోంది. అంటే మరో ఎనిమిదేళ్ళ పాటు అన్న మాట. రెండు టెర్ములు తాను సీఎం అని అనేక సార్లు రేవంత్ రెడ్డి పలు వేదికల మీద మీడియా కాంక్లేవ్ ల వద్ద చెప్పి ఉన్నారు. అయితే ఇపుడు మరో వేదిక మీద కూడా అదే మాట బలంగా చెప్పారు. తెలంగాణాలో 2028 లో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగాల్సి ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి దీని మీద కూడా మరో మాట చెబుతున్నారు. 2029 లో లోక్ సభతో తెలంగాణాకు ఎన్నికలు జరుగుతాయని ఆయన అంటున్నారు. ఆ లెక్కన తీసుకుంటే మరో అయిదేళ్ళు అంటే 2034 వరకూ కొత్త ప్రభుత్వం ఉంటుంది. ఓవరాల్ గా చూస్తే రేవంత్ రెడ్డి 11 ఏళ్ళ పాటు సీఎం గా ఉంటాను అని చెబుతున్నారు అన్న మాట.
విద్యా మంత్రిని కూడా :
ఫిన్‌లాండ్, జర్మనీ పర్యటన ముగించుకుని వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ కీలక ఈ వ్యాఖ్యలు చేశారు. తాను విద్యా శాఖ మంత్రిగా కూడా కొనసాగుతాను అన్నారు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను అని చెప్పారు. మంచి ఫౌండేషన్ తనకు అక్కడే పడింది అని అందుకే ఈ స్థాయికి వచ్చాను అన్నారు. తాను విద్యా మంత్రిగా ఉంటూ ప్రభుత్వ విద్యను మరింత నాణ్యంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లుగా చెప్పారు. తెలంగాణాలో విద్యా శాఖను అగ్ర స్థానంలో ఉంచుతామని ప్రపంచానికే ఆదర్శనంగా ఉండేలా చేసి చూపిస్తామని కూడా ఆయన చెప్పారు.
నాతో కొట్లాడాలి :
ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి మరో మాట అన్నారు. విద్యా సంబంధిత సమస్యల మీద ఉపాధ్యాయులు తనతో కొట్లాడాలి అని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు తనకు వదిలేయాలని వాట్ని అడగక ముందే పరిష్కరిస్తామని అన్నారు. బదిలీలు ప్రమోషన్లు అన్నీ తాను పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చారు. అందువల్ల ఉపాధ్యాయ సంఘాలు వ్యక్తిగత సమస్యలతో కాకుండా విద్యార్ధుల భవిష్యత్తు కోసం ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాలని కోరారు.
నేనే ఉంటాను అంటూ :
తాను ముఖ్యమంత్రిగా 2034 వరకూ ఉంటాను అని అందువల్ల ఉపాధ్యాయుల ప్రతీ సమస్య నెరవేరుస్తాను అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డిలో ఈ ధీమాకు కారణం ఏంటన్న చర్చ వస్తోంది. తన పనితీరు గురించి ఆయన బలమైన అంచనాకు రావడం వల్లనే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు అని అంటున్నారు. ఒక విధంగా చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఈ తరహా ప్రకటనలు ఎప్పుడూ ఎవరూ చేసి ఉండలేదు. వైఎస్సార్ లాంటి నాయకుడు కూడా అధినాయకత్వం నిర్ణయమే అని చెబుతూ ఉండేవారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తానే మరో ఎనిమిదేళ్ళ పాటు సీఎం గా కొనసాగుతాను అని నిబ్బరంగా చెబుతున్నారు. దానికి కారణాలు ఉన్నాయని అంటున్నారు. తెలంగాణా రాజకీయ వాతావరణం మీద ఆయనకు పూర్తి అవగాహన ఉందని విశ్లేషిస్తున్నారు. అంతే కాదు కాంగ్రెస్ పార్టీ లోపల అలాగ బయట కూడా రేవంత్ రెడ్డి బలమైన నేతగా ఉన్నారు. మంచి మాటకారిగా వ్యూహకర్తగా ప్రజాకర్షణ కలిగిన నేతగా ఆయన ఎమర్జ్ అయ్యారు. దాంతో ఆయన ఈ రకమైన ఆత్మ విశ్వాసం కనబరుస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే రేవంత్ రెడ్డి ధీమా మాత్రం ఆసక్తిని కలిగిస్తోంది అంటున్నారు.