• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మీ సెల్ నెంబరు 11 అంకెలకు...

మీ సెల్ నెంబరు 11 అంకెలకు ఎందుకు మారిపోనుంది?

By - Tupaki Desk
Update: 2020-05-30 04:15 GMT
మీరు చదివింది నిజమే. రానున్న రోజుల్లో సెల్ నెంబరు పదకొండు అంకెలకు వెళ్లనుంది. ఇప్పటివరకున్న పది అంకెల స్థానం నుంచి పదకొండు నెంబర్లకు చేరనుంది. ఎందుకిలా అంటే?.. ఇప్పుడున్న పది అంకెలతో కూడిన నెంబర్లు పూర్తి కావటం.. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మొబైల్ నెంబర్ల వినియోగం పెరిగే నేపథ్యంలో.. అంకెల సంఖ్యను పెంచాలన్న ఆలోచనలో ట్రాయ్ (భారత టెలికం రెగ్యులేటరీ ప్రాధికార సంస్థ) ఉంది. దీనికి సంబంధించిన తాజాగా కేంద్రానికి ఒక సిఫార్సు చేసింది.

ఒక అంకెను అదనంగా చేర్చటం ద్వారా వెయ్యి కోట్ల నెంబర్లు అందుబాటులోకి వస్తాయి. రానున్న అవసరాలను తీర్చటానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు.. భవిష్యత్తులో అంకెల్ని పెంచాల్సిన అవసరం రాకుండా ఉండేందుకు మరిన్ని నిర్ణయాల్ని తీసుకోనున్నారు. ల్యాండ్ నుంచి మొబైల్ కు ఫోన్ చేసేటప్పుడు సున్నా నొక్కటం తప్పనిసరి చేయనున్నారు.

అంతేకాదు.. రానున్న రోజుల్లో ఇంటర్నెట్ సేవలు మరింత ఎక్కువగా అవసరమైన నేపథ్యంలో.. డాంగిల్స్ కు ప్రస్తుతం ఇస్తున్న పది నెంబర్ల స్థానంలో పదమూడు నెంబర్లను ఉపయోగించాలన్న ఆలోచనను కేంద్రం ముందు ఉంచింది. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఒకవేళ ట్రాయ్ చెప్పినట్లే కేంద్రం పది నెంబర్లు ఉన్న ఫోన్ నెంబర్ ను పదకొండుకు మారిస్తే.. ప్రతి ఒక్కరి సెల్ పోన్ లో ఉండే వందలాది నెంబర్లు ఆటోమేటిక్ గా పదకొండు అంకెల్లోకి మార్చటం ఎలా అన్నది సమస్యగా మారనుంది. ఆటోమేటిక్ ప్రోగ్రాం ద్వారా.. ప్రతి ఒక్కరి ఫోన్ లో ఉన్న నెంబర్లకు పదకొండో నెంబరుగా ‘‘9’’ అంకె ముందుకు చేరేలా ప్రోగ్రాం చేస్తే చాలావరకు తిప్పలు తప్పుతాయి. లేదంటే.. ప్రతి ఫోన్ లో ఉండే పది అంకెల్ని పదకొండు అంకెలకు మార్చుకోవటం తల ప్రాణం తోకకు రావటం ఖాయం. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    
  • TRAI 
  • 11 Digit Mobile Numbers 
  • India Mobile Numbers 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

చంద్రబాబు హిట్ లిస్టులో ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు, త్వరలో నిర్ణయం

2026-11-12 10:30 GMT

సాయిరెడ్డి గాలి తీసేసిన పాల్‌!

2026-11-12 10:17 GMT

పీఆర్‌పీ చీఫ్.. ఎవ‌రీ సాయిరెడ్డి.. ఈ విష‌యాలు తెలుసా?!

2026-11-12 10:17 GMT

ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?

2026-11-12 08:16 GMT

ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్.. అమెరికా వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది?

2026-11-12 08:16 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

2026-11-12 06:05 GMT

బీబీసీకి ఎదురుదెబ్బ.. ట్రంప్ పరువు నష్టం కేసుకు గ్రీన్ సిగ్నల్!

2026-11-12 06:05 GMT

చాక్లెట్ బాక్సును వదలని ‘బాబు’ గారు.. ఆయన ఆలోచన అలా ఉంటుంది మరీ

2026-11-12 05:54 GMT

రాప్తాడు నిందితుడికి తీవ్ర అనారోగ్యం.. బతికినంతకాలం దుర్భర జీవితమే..!?

2026-11-12 05:49 GMT

జెన్సన్‌కు మస్క్ ఉద్యోగం ఇస్తారా? వివాదం మధ్య ఆసక్తికర ఆఫర్!

2026-11-12 05:49 GMT

ప్రభుత్వం మారినా పెట్టుబడుల ఒప్పందాలు మారకూడదు.. చంద్రబాబు కొత్త ఆలోచన!

2026-11-12 05:48 GMT

Copyright @2026

Powered by Blink CMS