మూడు విమానాలు వెనక్కి వచ్చేశాయి

Update: 2015-09-05 07:53 GMT
గగనతలంలో దాడులు జరుగుతాయంటూ గత కొద్ది రోజులుగా నిఘా అధికారులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో డ్రోన్ల సంచారాన్ని కూడా నిషేధించారు.

శనివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆరు విమానాల్లో బాంబు దాడులు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ హెచ్చరించాయి. ఈ ఆరు విమానాల్లో మూడు విమానాలు అప్పటికే బయలుదేరి వెళ్లిపోయాయి. ఎప్పుడైతే బెదిరింపు ఫోన్ కాల్స్ అందుకున్నారో.. వెను వెంటనే బయలుదేరి వెళ్లిన మూడు విమానాల్ని వెనక్కి తెప్పించారు.

వాటిని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మిగిలిన మూడు విమానాలతో పాటు.. ఢిల్లీ.. బెంగళూరు ఎయిర్ పోర్ట్ లలో క్షుణ్ణంగా  తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Tags:    

Similar News