ప్రతి ఏటా కోటిన్నర మంది నెలలు నిండకుండానే పుడుతున్నారట !

Update: 2020-11-17 13:30 GMT
ఇండియా .. ఓ భూతల స్వర్గం. భిన్న మతాలకి , ఎన్నో భాషలకి నిలయం. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో అన్ని రకాల మతాల , జాతుల వారు కలిసినివసిస్తూంటారు. ఈ కారణంతో ప్రపంచంలో భారత్ కి ఓ విశిష్టమైన గుర్తింపు ఉంది. అయితే , తాజాగా ఓ సర్వే లో  నెలలు నిండని శిశువులు భారత్‌లోనే ఎక్కువగా పుడుతున్నారని తేలింది. ఇది కొంచెం ఆందోళన చెందాల్సిన విషయమే.  నెలలు నిండకుండా పుట్టిన శిశువుల్ని రకరకాల  అనారోగ్య సమస్యల బారిన పడతారు , వారిని కాపాడుకోవడం  పెనుసవాల్‌. గర్భిణుల్లో ఇన్‌ ఫెక్షన్, ఇతరత్రా అనారోగ్య సమస్యల వల్ల శిశువులు నెలలు నిండకుండా పుడతారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా కోటిన్నర మంది పిల్లలు ఇలా నెలలు నిండకుండా పుడుతున్నారు.  అందులో దాదాపుగా 35 లక్షల మంది కేవలం భారత్ లో పుడుతున్నారట.  ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరు, భారత్‌ లో ప్రతీ ఎనిమిది మందిలో ఒకరు నెలలు నిండకుండానే పుడుతున్నట్లు వైద్య నిపుణులు చెప్తున్నారు.

ప్రపంచంలో 60% మంది దక్షిణాసియా, ఆఫ్రికాలోనే నెలలు నిండకుండా పుడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ రోజు   నవంబర్‌ 17  వరల్డ్‌ ప్రిమెచ్యూరిటీ డే. నెలలు నిండని పిల్లలు పుట్టకుండా, పుట్టిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నదే ఈ  వరల్డ్‌ ప్రిమెచ్యూరిటీ డే ముఖ్యమైన ఉద్దేశం. సాధారణంగా గర్భధారణ సమయం 40 వారాలు. సరిగ్గా నెలలు పూర్తయి పుడితే సహజంగా అనారోగ్య సమస్యలుండవు. 37 వారాల కంటే ముందు పుడితే వారిని నెలలు నిండని శిశువు అంటారు. అలాంటి వారిలో ఎక్కువగా సమస్యలు ఉంటాయి. గర్భిణుల్లో ప్రత్యేక కారణాల వల్ల బీపీ పెరగడం, కాలేయంలో సమస్యలు ఏర్పడటం వల్ల కూడా నెలలు నిండకుండానే ప్రసవమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కవల పిల్లల్లో 60 – 70 శాతం మంది నెలలు నిండని వారేనని వైద్య నిపుణులు అంటున్నారు. నెలలు నిండకుండా పుట్టేవారు కిలో కంటే తక్కువ బరువుంటే అతి తీవ్ర అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే ఎక్కువశాతం మంది మరణిస్తారు కూడా.

అయితే , నెలలు నిండా పుట్టిన శిశువు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలని ఒకసారి చూస్తే ..పుట్టిన బిడ్డ ఒక  కిలో కంటే తక్కువ బరువున్నట్టు భావిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. పుట్టగానే డెలివరీ రూమ్‌లోనే వారికి అవసరమైన సంరక్షణ చేయాలి. నెలలు నిండని శిశువులు చలికి తట్టుకోలేరు. కాబట్టి వార్మర్‌ పెట్టాలి. ప్లాస్టిక్‌ పాలిథిన్‌ కవర్‌ శరీరానికి చుట్టాలి.  అవసరం మేరకు ఆక్సిజన్‌ వాడాలి. శ్వాసపరమైన ఇబ్బంది ఉంటే ప్రత్యేకంగా సరఫరా చేయాలి.  నెలలు నిండని శిశువుల్ని ఇంక్యుబేటర్‌లో పెట్టడం ద్వారా కాపాడుకోవచ్చు. తల్లిపాలు దివ్యౌషధం. జీర్ణవ్యవస్థ, పరిణితి చెందడానికి ఇవి సాయపడతాయి. ఇన్ ‌ఫెక్షన్‌ కాకుండా చూసుకోవాలి. అవసరమైతేనే శిశువులను తాకాలి. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.  ఒక బిడ్డ నుంచి ఇతర బిడ్డలకు ఇన్ ‌ఫెక్షన్‌ కాకుండా చూసుకోవాలి. అవసరమైతే యాంటీ బయోటిక్స్‌ వాడాలి. చిన్నపిల్లలను చూసే యూనిట్లలో ఇంటెన్సివ్‌ కేర్‌ అందించాలి. రణగొణ ధ్వనులు ఉండకూడదు. అనవసరంగా లైట్లు వేయకూడదు.  క్లస్టర్‌ కేర్‌ ద్వారా బిడ్డను సంరక్షించాలి. కొన్ని రకాల మందులివ్వాలి.
Tags:    

Similar News