అలీ అందుకే వైఎస్సార్సీపీలో చేరావా?

Update: 2020-02-26 14:30 GMT
సినీ పరిశ్రమలో హాస్య నటుడి పేరు ప్రఖ్యాతులతో పాటు భారీగా వెనకేసుకున్న నటుడు 2019 ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. అయితే ఆ సమయంలో ఆ పార్టీనా.. ఈ పార్టీనా అని రెండు నెలలు తెగ ఆలోచించి.. అన్ని లెక్కలు వేసుకుని చివరకు తన స్నేహితుడి పార్టీని కాదని ఒక పార్టీలో చేరాడు. ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయనకు కలిసొచ్చింది. ఈ క్రమంలో తన వ్యక్తిగత సమస్య కూడా పరిష్కారమైంది. దీంతో ఆయన వాస్తవంగా పార్టీలో చేరింది దానికోసమేనని చర్చ సాగుతోంది. ఇంతకు ఆ సమస్య ఏంటి? ఎవరా వ్యక్తి? అంటే..

సినీ పరిశ్రమలో ప్రముఖ హాస్యనటుడిగా ఉన్న ఆలీ ప్రస్తుతం సినిమాల్లో కనిపించడం లేదు. కానీ టీవీ షోస్, ప్రచార కార్యక్రమాలకు వెళ్తున్నాడు. ఆయనకు ఎప్పటి నుంచో రాజకీయాలపై ఆసక్తిగా ఉంది. గతంలోనే తెలుగుదేశం పార్టీలో కొనసాగాడు. అయితే చంద్రబాబు అధికారం కోల్పోతున్నాడని ముందే గ్రహించిన ఆలీ ఏ పార్టీలో చేరదామనే విషయంలో తర్జనభర్జన పడ్డాడు. చివరకు వ్యక్తిగత పనుల కోసం.. పైగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని భావించి వెంటనే జగన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. తన వ్యక్తిగత పనుల కోసం ఏకంగా తన స్నేహితుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని వదిలేసి మరీ వచ్చాడు. అప్పుడు అందరికీ జగన్ తో ఎందుకు కలిశాడో ఎవరికీ తెలియరాలేదు. ఇప్పుడు ఆలీ ఎందుకు చేరాడో తెలుస్తోంది. ఈ విధంగా సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది..
Read more!

ప్రస్తుతం ఆలీ వైఎస్సార్సీపీలోనే కొనసాగుతున్నాడు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో తన వ్యక్తిగత సమస్య నుంచి గట్టెక్కినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని షాద్ నగర్ లో ఆలీకి భూములు ఉన్నాయి. ఆ భూములు వివాదాస్పదంగా ఉండడంతో ఆలీకి ఏం తోచలేని సమయంలో రాజకీయాల్లోకి వెళ్తితే పరిష్కారం లభిస్తుందని భావించాడంట. అందుకే అప్పుడు వైఎస్సార్సీపీలో చేరాడు. ఆ పార్టీలో చేరడంతో ప్రస్తుతం ఆ సమస్య పరిష్కారమైనట్టు తెలుస్తోంది. ఆ షాద్ నగర్ లో అతడికి పెద్ద ఎత్తున ఉన్న భూముల్లో కొన్ని అసైన్డ్, ప్రభుత్వ భూములతో పాటు అటవీ ప్రాంతం ఉందంట. వాటి నుంచి ఇబ్బంది ఉండకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్న జగన్ తో పరిష్కారం లభిస్తుందని భావించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడని ఇప్పుడు తెలుస్తోంది.

పార్టీలో చేరినప్పటి నుంచి ఆలీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ముఖ్యంగా నవరాత్రల విషయమై ప్రచారం చేయకపోవడం, ఆ తర్వాత అధికార వికేంద్రీకరణలో భాగంగా రాజధాని మార్పు విషయమై కనీసం స్పందించలేదు. కేవలం వ్యక్తిగత కారణం రీత్యా జగన్ పార్టీలో చేరి సద్వినియోగం చేసుకున్నాడని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.


Tags:    

Similar News