'శ్రీ చైతన్య' వైదొలగడానికి కారణమేంటి?

Update: 2019-10-22 12:06 GMT
విద్యారంగంలో ఎంతో పేరు, నేషనల్ ర్యాంకులతో ‘శ్రీచైతన్య’ విద్యాసంస్థలు ఘనత సాధించాయి. ఈ తెలుగు విద్యాసంస్థ ఇప్పుడు వేలంలోకి వచ్చినట్టు మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. ఏమైందో ఏమో కానీ ఈ విద్యాసంస్థను కొనుగోలు చేయడానికి ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ బ్రూక్ ఫీల్డ్, కల్పతి ఇన్వెస్ట్ మెంట్స్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి..

శ్రీచైతన్య సంస్థను దాదాపు 1 బిలియన్ డాలర్లకు కల్పతి ఇన్వెస్ట్ మెంట్స్ కొనడానికి రెడీ అయినట్లు వార్తలు వెలువడుతున్నాయి.. కల్పతి సంస్థ గతంలో కే12 అనే స్కూల్ సెగ్మెంట్ ను కూడా కొని విజయవంతంగా నడిపిస్తోంది.

2011లో దాదాపు 25 మిలియన్ డాలర్ల పెట్టుబడితో శ్రీచైతన్య మొదలైంది. దాదాపు 8 ఏళ్ల ఇన్వెస్ట్ మెంట్ కాలం ముగియడంతో ఆ సంస్థ ఇన్వెస్టర్లు తప్పుకుంటున్నట్టు సమాచారం. దీంతో శ్రీచైతన్య స్కూల్స్ అన్నింటిని కొనుగోలు చేసే ఇన్వెస్టర్ల కోసం శ్రీచైతన్య యాజమాన్యం చూస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం శ్రీచైతన్యం మార్కెట్ విలువ దాదాపు 8000 కోట్లు. విద్యారంగం ఇప్పుడు దేశంలోనే పెద్ద బిజినెస్. సామాజిక ప్రయోజనం కూడా ఇందులో ఉంటుంది. అయితే లాభాలు తెచ్చిపెట్టే ఈ బిజినెస్ లో రిస్క్ లు కూడా అధికమే.. శ్రీచైతన్యకు దాదాపు 700 స్కూల్స్ ఉన్నాయి. విద్యార్థులతో చెలగాటం కాబట్టి ఈ బిజినెస్ లోకి ఎవరూ రారు. స్కూలు ఫీజుల తలనొప్పులు ఉంటాయి. 1986లో బోపన్న సత్యనారాయణ, ఝన్సీ లక్ష్మీబాయి విజయవాడలో స్థాపించిన శ్రీచైతన్య కాలేజీ సంస్థలను 2019లో అమ్మకానికి పెడుతున్నారన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా  మారింది.తెలుగు విద్యాభిమానులకు శ్రీచైతన్య నిర్ణయం షాక్ లా పరిణమించింది..


Tags:    

Similar News