• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  దిస్​ ఈజ్​ రైనా..! మొదటి...

దిస్​ ఈజ్​ రైనా..! మొదటి మ్యాచ్​ లోనే దుమ్ము లేపాడు..!

By - Tupaki Desk
Update: 2021-04-11 06:30 GMT
సురేశ్​ రైనా సీఎస్​కే జట్టులోని ఓ మణిపూస. కానీ అబుదాబిలో జరిగిన  గత సీజన్​ లో అతడు వ్యక్తిగత కారణాల వల్ల మధ్యలోనే ఇండియాకు తిరిగి  వచ్చేశాడు. రైనాకు బాల్కనీ ఉన్న హోటల్​ గది కేటాయించలేదని.. అందుకే అతడు అవమానంగా ఫీలయ్యి వచ్చేశాడని అప్పట్లో టాక్​ వినిపించింది. ఇదిలా ఉంటే గత సీజన్​ లో చెన్నై ఘోరమైన ఆటతీరును కనబర్చింది. కనీసం ప్లే ఆప్స్​ కు కూడా వెళ్లకుండా వెనుదిరిగింది. ఒకవేళ రైనా ఉండి ఉంటే సీఎస్​కే రాణించి ఉండేదన్న వాదన వినిపించింది.

 తాజాగా జరిగిన మ్యాచ్ లో  రైనా సీఎస్​కే  తరపున  అదరగొట్టాడు. నిన్న జరిగిన మ్యాచ్​ లో సీఎస్​కే .. ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్​లో సీఎస్​కే ఓడిపోయినప్పటికీ .. రైనా రీ ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. అతడు అద్భుతమైన ఆటతీరును కనబరిచి ప్రేక్షకులను మెస్మరైజ్​ చేశాడు.రైనా.. కేవలం 34 బంతుల్లో 54 పరుగులు చేశాడు. మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో దుమ్ము దులిపేశాడు. చివరకు జడేజాతో చిన్న కమ్యూనికేషన్​ గ్యాప్​ తో రన్​ అవుట్​ కావాల్సి వచ్చింది.

 రైనా ఆటతీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘గత సీజన్​ లో నీకు బాల్కనీ ఉన్న హోటల్​ గది కేటాయించలేదని అలిగావట. ఆ సారి బాల్కనీ కాదు.. దాని బాబు లాంటి హోటల్​ ను బుక్​ చేస్తారు’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.మొదటి మ్యాచ్​లోనే హాఫ్​ సెంచరీ కొట్టడం పట్ల రైనా పట్ల  ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ మ్యాచ్​ లో సీఎస్​కే బ్యాట్స్​మెన్లు చెలరేగి ఆడారు. ముంబైలోని వాంఖడే స్టేడియం బ్యాటింగ్​ అనుకూలం కావడంతో చెన్నై బ్యాట్స్​మెన్లు బాగానే పరుగులు రాబట్టారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్​ తరఫున పృథ్వీ  షా, శిఖర్​ ధావన్​ చెలరేగి ఆడటంతో ఆ జట్టు అలవోకగా విజయం సాధించింది. శ్రేయస్​ అయ్యర్​ లేకపోయినా.. రిషబ్​ పంత్​ జట్టును ఎంతో నేర్పుగా ముందుకు తీసుకెళ్లాడు. అయితే సురేశ్​ రైనా ఆటతీరుపై  సెహ్వాగ్​ కూడా ప్రశంసించాడు.
Tags:    
  • IPL 
  • IPL 2021 
  • IPL Matches 
  • IPL 2021 Updates 
  • IPL Latest Updates 
  • BCCI 
  • suresh raina 
  • csk 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS