మూడో విడత పోలింగ్ శాతం..యావరేజ్!

Update: 2019-04-23 16:58 GMT
లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా జరిగిన మూడో విడత పోలింగ్ లో ఫర్వాలేదనిపించుకునే స్థాయి పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం నూటా పదిహేను ఎంపీ సీట్లకు పోలింగ్ పూర్తి అయ్యింది మూడో విడతలో. పోలింగ్ రోజు సాయంత్రం  ఐదు గంటలకు  61.31 శాతం పోలింగ్ నమోదు అయినట్టుగా సీఈసీ ప్రకటించింది. స్థూలంగా ఈ శాతం మరి కాస్త పెరగవచ్చు.

మూడో విడత పోలింగ్ జరిగిన రాష్ట్రాల్లో అత్యధికంగా పశ్చిమ బెంగాల్ లో 78.94 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అత్యల్పంగా పోలింగ్ నమోదు అయిన రాష్ట్రంగా జమ్మూ అండ్ కశ్మీర్ నిలిచింది.  అక్కడ 12.46 శాతం పోలింగ్ మాత్రమే నమోదు అయ్యింది.

సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ బూత్ ల క్యూల్లో నిలిచిన ఓటర్లకు కూడా ఓటు వేసే అవకాశం ఉండటంతో మరి కాస్త పోలింగ్ శాతం పెరిగి ఉండే అవకాశం ఉంది. 18.85 కోట్ల మంది ఓటర్లలో 61.31 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మూడో విడత పోలింగ్ పూర్తి కావడంతో దేశంలోని మెజారిటీ ఎంపీ సీట్లకు పోలింగ్ పూర్తి అయ్యింది. తొలి - రెండో విడతల్లో దాదాపు నూటా తొంభై ఎంపీ సీట్లకు పోలింగ్ పూర్తి అయ్యింది. మూడో విడతలో నూటా పదిహేను ఎంపీ సీట్లను కలుపుకుంటే దాదాపు మూడు వందల ఎంపీ సీట్లకు పోలింగ్ ప్రక్రియ పూర్తి అయినట్టే.


Tags:    

Similar News