వైసీపీ ధీమా పడితే బోల్తా కొట్టాల్సిందే !
వైసీపీ ఒక మాయలో పడిపోతోందా. దాని నుంచి బయటకు రాలేకపోతోందా అంటే అవును అనే విశ్లేషకులు అంటున్నారు. అదే సర్వే మాయ.;
వైసీపీ ఒక మాయలో పడిపోతోందా. దాని నుంచి బయటకు రాలేకపోతోందా అంటే అవును అనే విశ్లేషకులు అంటున్నారు. అదే సర్వే మాయ. సర్వేలే వైసీపీ కొంప ముంచాయన్నది 2024 ఎన్నికల్లో బాగా తెలిసిన సంగతే. సర్వేలను చూసుకుని ఇక తిరుగులేదనుకుని వై నాట్ 175 అని లౌడ్ వాయిస్ తో ఇచ్చిన సౌండ్ కి వచ్చిన రిజల్ట్ చూస్తే దిమ్మదిగిరేలా ఉంది. జస్ట్ 11 సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయి. ఇపుడు చూస్తే కూటమి అధికారంలోకి వచ్చి కేవలం 18 నెలలు మాత్రమే అయింది. ఇంతలోనే నూరు శాతం వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మీద అని వస్తున్న సర్వేలను నమ్మితే బోల్తా కొట్టేది వైసీపీయే అని అంటున్నారు.
మెజారిటీ టైం :
ఈ రోజున చూస్తే మెజారిటీ టైం కూటమి చేతిలో ఉంది. అంటే ఇంకా మూడున్నరేళ్ళ కాలం అన్న మాట. మరి అక్కడ ఉన్నది చంద్రబాబు ఆయనే ఎపుడూ అలెర్ట్ గా ఉంటారు. పైగా సొంత సర్వేలు అనేకం చేయిస్తారు, వివిధ వర్గాల నుంచి సర్వేలు వస్తూంటాయి. వాటితో పాటు ఎప్పటికపుడు అప్రమత్తంగా ఉంటూ లోపాలను సరిదిద్దుకుంటారు. అలాగే క్యాడర్ ని కూడా దిశా నిర్దేశం చేస్తూ ముందుకు సాగేలా చూసుకుంటారు. అలాంటి చంద్రబాబు చేతిలో మెజారిటీ టైం ఉంది అంటే ఆయన ఏమైనా చేయగలరు అన్నది కూడా ఉంది.
లాజిక్ మిస్ అయితే :
ఇక అసలైన విషయం మరోటి ఉంది. ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుంది. అయితే అది అవతల పక్షానికి అనుకూలత గా కూడా కావాలి కదా అన్నదే ఆ విషయం ఇది లాజిక్ తో కూడుకున్న అంశం. అంటే వ్యతిరేకతను తమకు అనుకూలంగా చేసుకునే పరిస్థితిలో అపొజిషన్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. వైసీపీ విషయం చూస్తే ఇంకా జనంలోకి గట్టిగా వెళ్ళడం లేదు, సంస్థాగతంగా లోపాలు ఉన్నాయి. క్యాడర్ లోనూ లీడర్ లోనూ జోష్ ఇంకా పెరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంక ఏముంది మనదే అధికారం అన్నట్లుగా వస్తున్న సర్వేలను కనుక నమ్మితే మొత్తానికి మొత్తం ఇబ్బంది వచ్చేది వైసీపీకే అని అంటున్నారు.
రియాలిటీలో ఉంటూ :
ఇక చూస్తే రియాలిటీగా ఉండాల్సిన అవసరం ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది అని అంటున్నారు. గ్రౌండ్ లెవెల్ లో ఉండే వాస్తవాలు కొన్ని కఠినంగా ఉంటాయి. వాటిని స్వీకరించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా తమలోని లోపాలను కూడా సరిదిద్దుకోవాలి. జనంతో నిత్యం మమేకం అవుతూ ఉండాలి, ప్రజల నాడిని పట్టుకోవాలి, ప్రజా సమస్యల మీద నిరంతరం టాప్ టూ బాటం పోరాటం చేయాలి. వీలైనన్ని ఫ్లాట్ ఫారాలు అన్నీ వాడుకోవాలి. అందులో అత్యున్నత చట్ట సభలు కూడా ఉన్నాయి. అలాగే పవర్ ఫుల్ మీడియా ఉంది, జనంలో పర్యటనలు ఉన్నాయి. ఇలా అన్నీ చేస్తూ పోతే కనుక ఏ సర్వేలు అవసరం లేకుండానే ప్రజలలో ఏముందో ఏమి వారు కోరుకుంటున్నారో తెలుస్తుంది, అంతే తప్ప సర్వేల మాయలో పడి కాళ్ళు జాపేస్తే మాత్రం వైసీపీకే ఇబ్బంది అని అంటున్నారు.