మెలటోనిన్ సప్లిమెంట్స్ వాడుతున్నారా.. ఇది మీ కోసమే!

అవును... శరీరానికి తగినంత నిద్ర ఉండటం వల్ల ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు! ఇది బరువు, బీపీ, మధుమేహం, మానసిక, శరీరాక పనితీరుతో పాటు భావోద్వేగాల విషయంలోనూ కంట్రోల్ ఇస్తుందని చెబుతారు.;

Update: 2025-12-15 18:30 GMT

మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర అంటారు.. మంచి నిద్రకు మంచి అలవాట్లు, సమయపాలన అని చెబుతారు! ఈ సమయంలో మంచి నిద్ర ఎలాగూ అవ్వడం లేదు, కనీసం ఏదోలా నిద్రపోదాం అనుకునే జీవనశైలి ఇటీవల ఎక్కువగా అలవాటైపోతుంది! ఈ విషయంలో చిన్నలు, పెద్దలు అనే తేడాలు పెద్దగా లేవు. వీరిందరినీ నిద్ర కోసం ఉన్న ఆప్షన్ గా మెలటోనిన్ మారిపోతోన్న పరిస్థితి. ఈ సమయంలో దీనిపై వైద్యులు కీలక హెచ్చరికలు చేస్తున్నారు.

అవును... శరీరానికి తగినంత నిద్ర ఉండటం వల్ల ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు! ఇది బరువు, బీపీ, మధుమేహం, మానసిక, శరీరాక పనితీరుతో పాటు భావోద్వేగాల విషయంలోనూ కంట్రోల్ ఇస్తుందని చెబుతారు. అలా అని పూర్తిగా స్లీప్ సప్లిమెంట్స్ కు పూర్తిగా అలవాటు పడకూడదని అంటారు. అంతవరకూ కరెక్టే కానీ... ఈ విషయంలో మెలటోనిన్ కు ప్రత్యామ్నయం చెబుతున్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంజయ్ భోజరాజ్.

ఇందులో భాగంగా... మెలటోనిన్ గురించి ఇటీవల కొన్ని ఆందోళనలు తలెత్తాయని.. వీటిని ఎక్కువగా తీసుకుంటే, అది పిల్లల్లో యుక్తవయస్సును అణిచివేస్తుందని.. అందువల్ల న్యూరోట్రాన్స్మిటర్ అయిన మెలటోనిన్ తనకు నచ్చని చాలా పనులు చేయగలదని డాక్టర్ భోజరాజ్ తెలిపారు. దీనివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. దీర్ఘకాలికంగా ఉపయోగించకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఈ నేపథ్యంలో మెలటోనిన్ కు మెగ్నీషియం సురక్షితమైన, మహుముఖ ప్రత్యామ్నాయంగా డాక్టర్ భోజరాజ్... మెగ్నీషియం విషయంలో అయితే దాన్ని తాను సమర్ధిస్తానని.. మెగ్నీషియం తనకు చాలా ఇష్టమని.. మీరు దీన్ని నిద్ర కోసం ఉపయోగించొచ్చని.. అంతేకాదు ఇది ప్రేగు ఆరోగ్యాన్ని కూడా నియంత్రించడానికి ఉపయోగించొచ్చని.. వాపును నియోత్రించడానికీ ఉపయోగించవచ్చని వివరించారు.

ఈ సందర్భంగా... చాలా కారణాల వల్ల తనకు మెగ్నీషియం అంటే చాలా ఇష్టమని.. అందులోనూ ప్రధానంగా మెగ్నీషియం గ్లైసినేట్ లేదా మెగ్నీషియం థ్రెయోనేట్ లు తాను ఎక్కువగా ఇష్టపడే మెగ్నీషియల్ లవణాలని డాక్టర్ సంజయ్ భోజరాజ్ వివరించారు. ఈ విషయాలను తన ఇన్ స్టాగ్రామ్ వీడియోల్లో వెల్లడించారు.

అంతకంటే ముందు మరో వీడియోలో ఎన్ని గంటలు కనీసం నిద్రపోవాలనే విషయంపైనా ఆయన స్పందించారు. ఇందులో భాగంగా... మెదడు, గుండె ఆరోగ్యానికి కనీసం ఏడున్నర గంటలు నిద్ర అవసరమని, అదే సరైన సమయమని తెలిపారు. వాస్తవానికి ఇది అంత సులభం అని నేను చెప్పడంలేదు కానీ అని అంటూనే.. కనీసం ఏడున్నర గంటల నిద్రను లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు.



Tags:    

Similar News