వారందరు 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే !

Update: 2020-05-25 04:26 GMT
మహమ్మారి కట్టడి కోసం లాక్ డౌన్ విధించిన తరుణంలో లాక్ డౌన్ నియమాలకు లోబడి విమాన సర్వీసులు కూడా పూర్తిగా నిలిపివేశారు. అయితే, లాక్ డౌన్ నుండి ఇచ్చిన సడలింపులు నేపథ్యంలో దాదాపుగా రెండు నెలల తరువాత  విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. లాక్‌ డౌన్ ‌కు ముందుతో పోలిస్తే మూడో వంతు సామర్థ్యంతో విమానాల సర్వీసులు పనిచేస్తాయి. 7 కేటగిరీల్లో విమాన సర్వీసు ఛార్జీలు అమల్లో ఉన్నాయి. అయితే, విమాన ప్రయాణికులను క్వారంటైన్ ‌పై గందరగోళం తలెత్తుతోంది.

విమాన ప్రయాణికుల క్వారంటైన్ పై  తోచిన విధంగా రాష్ట్రాలు మార్గదర్శకాలను ప్రకటించాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, బిహార్‌ సహా పలు రాష్ట్రాలు సొంతంగా క్వారంటైన్‌ నిబంధనలు ప్రకటించాయి.  ప్రయాణికులు తప్పనిసరిగా ఇన్ ‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌ లో ఉండాలని నిబంధనలు విధించాయి. అలాగే మరికొన్ని రాష్ట్రాలు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులంతా తాము వెళ్లే రాష్ట్రాలకు సంబంధించిన ఆరోగ్య ప్రొటోకాల్ ‌లను ముందే చదవాలని విమానయాన సంస్థలు కోరాయి. ఆయా రాష్ట్రాల నుంచి వెనక్కి రావాల్సి వచ్చినా, వాటిలో క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చినా తమకు సంబంధం లేదని విమానయాన సంస్థలు స్పష్టం చేశాయి.

ఇక తిరిగి ప్రారంభం అయిన విమానాలలో మొదటిది న్యూ ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3 నుండి ఈ రోజు ఉదయం 5 గంటలకు బయలుదేరి ఉదయం 6గంటల 42నిమిషాలకు పూణేలో ల్యాండ్ అయింది. మరోవైపు విమాన సేవలను మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాలు వ్యతిరేకించాయి.

Tags:    

Similar News