అప్పుడు నాకు ఇస్తారనుకున్న కెప్టెన్సీ ధోనికి ఇచ్చారు : యువరాజ్ !
యువరాజ్ సింగ్ .. ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన ఆటగాడు. సిక్సర్ల కింగ్ .. 2007 టీ20 ప్రపంచకప్ , 2011 వన్డే ప్రపంచకప్ ఇండియా అందుకొవడంలో కీలక పాత్ర వహించిన ఆటగాడు. ఒక్కసారి బ్యాటు జులిపించడం స్టార్ట్ చేస్తే , ఇక యువీ కి ఎదురొడ్డే బౌలర్ ఉండడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. అలాగే క్రికెట్ టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని .. క్రికెట్ ప్రపంచంలో ఓ గొప్ప ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఇండియా కి ఈ ఇద్దరు లెజెండ్స్ ఎన్నో మరపురాని విజయాల్ని అందించాడు. ఇదిలా ఉంటే .. తాజాగా ధోని పై యువీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో నాకు కెప్టెన్సీ ఇస్తారనుకున్నా .. కానీ ధోనికి ఇచ్చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు .
వివరాల్లోకి వెళ్తే .. 2007 వన్డే ప్రపంచకప్ ఘోర పరాజయం తర్వాత పెద్దగా అంచనాలు లేకుండా అరంగేట్ర టీ20 ప్రపంచకప్ టోర్నీలోకి బరిలోకి దిగిన ధోనీసేన దుమ్మురేపింది. సూపర్ పెర్ఫామెన్స్ తో ఫస్ట్ టైటిల్ ను ఎగరేసుకుపోయింది. వాస్తవానికి ఈ ఫార్మాట్ పట్ల బీసీసీఐ, టీమిండియా సీనియర్ క్రికెటర్లు అప్పట్లో అయిష్టతను వ్యక్తం చేశారు. దాంతోనే సచిన్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ ఈ టోర్నీ ఆడకుండా యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. అయితే జట్టులో సీనియర్ అయిన యువరాజ్ సింగ్ కు కెప్టెన్సీ ఇస్తారని భావించినా సెలెక్టర్లు అప్పుడప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తాచాటుతున్న ధోనీకి అవకాశమిచ్చారు. తాజాగా ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సమయంలో కెప్టెన్సీ ఆశించానని తెలిపాడు. 2007 వన్డే వరల్డ్ కప్ లో భారత్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పూర్తి గందరగోళం నెలకొంది.
సీనియర్ల దూరం అయ్యారు. ఎవరూ కూడా టీ20 ప్రపంచకప్ ను సీరియస్ గా తీసుకోలేదు. దాంతో జట్టు సారథ్య బాధ్యతలు నాకే ఇస్తారనుకున్నా. కానీ సెలెక్టర్లు ధోనీ పేరు ప్రకటించారు. ఇక ఎవరు కెప్టెన్ అయినా ఓ ఆటగాడిగా రాణించడం, కెప్టెన్ అండగా నిలవడం ముఖ్యం. అది రాహుల్ ద్రవిడ్ అయినా.. గంగూలీ అయినా, మరెవరైనా టీమ్ మ్యాన్ గా రాణించడం కనీస బాధ్యత. ఆ టోర్నీలో నేను అదే చేశా'అని యువీ చెప్పుకొచ్చాడు. ఇక కెప్టెన్సీ చేజారినా టీమ్ మ్యాన్ గా యువీ ఈ టోర్నీలో సత్తా చాటాడు. 6 మ్యాచ్ ల్లో 148 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతులకు 6 సిక్స్‌లు బాది వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. ఆ విధ్వంసంతో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇప్పటికీ ఆ రికార్డు అలానే చెక్కుచెదరకుండా ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో 70 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.